సినిమా

వైస్సార్ బయోపిక్ ‘యాత్ర’ రివ్యూ మరియు రేటింగ్!

దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘యాత్ర’ దివంగత మహానేత రాజన్న పాదయాత్ర నేపథ్యంలో ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి మహి వి రాఘవ దర్శకత్వం వహించారు. 70 ఎంఎం బ్యానర్ పై శశి దేవిరెడ్డి,విజయ్ చల్ల నిర్మించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వైఎస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రానికి విపరీతమైన హైప్ వచ్చింది.

ట్రైలర్ ,టీజర్ ,సొంగ తో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ..మారి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం ..ముందుగా కధ విషయానికి వస్తే .. ఇది ప్రధానంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో సాగుతుంది .. ముందుగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నేను అనే మాట ద్వారా సినిమా ప్రారంభం అవుతుంది ..

ఆ తర్వాత అది వైఎస్ కన్న కలగా చూపించబడుతుంది ..అయితే పేదల కష్టాలు తెలుసుకోవడం కోసం ..కడప గడప దాటి ప్ర‌తి గ‌డ‌ప‌లోకి స్వ‌యంగా వెళ్ళి పేద‌వాడి స‌మ‌స్య‌లు తెలుసుకోవడానికి ఈ యాత్ర మెద‌లుపెడతారు వైఎస్ ఆర్. యాత్ర ప్రారంభ‌మైన ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌తి రైతుని, పేద‌వాడిని స్వ‌యంగా క‌లిసి వారి స‌మ‌స్య‌లు విన‌ట‌మే కాదు…

విన్న వైఎస్ హృదయం ఎలా స్పందించిందో అన్నది ప్రధానంగా సాగుతుంది . డాక్ట‌ర్ రాజ‌శేఖ‌రుడు ప్రారంభించిన యాత్ర రాజ‌న్నగా ముగియడంలో రాజశేఖర్ ప్రజలకు ఎంతగా ద‌గ్గ‌ర‌య్యార‌నేది ఇందులోని ప్రధాన కధ .. వ్యవసాయం దండగగా మారిన పరిస్థితుల్లో ఎవ‌రైనా ఆదుకుంటారా అని రైతన్న ఎదురుచూసిన స‌మ‌యంలో నేను విన్నాను నేను వున్నాను అంటూ ఓ పిలుపు ప్రజల్లోకి ఎలా వెళ్ళింది ..

నాయ‌కుడిగా మ‌న‌కు ఏం కావాలో తెలుసుకున్నాము. కాని… జ‌నానికి ఏం కావాలో తెలుసుకొలేక‌పోయాము అంటూ పేద ప్ర‌జ‌ల క‌ష్టాల్ని విన‌టానికి వైఎస్ బయలు దేరడం ,,ఆయన్ని ప్రజలు ఆదరించడం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది ..ఇక నటీనటుల విషయానికి వస్తే .. వైఎస్‌గా మమ్ముట్టి ఇంట్రీ సీన్‌ని హైలైట్‌గా ఉంది .. ఆ పాత్రలో రాజన్న తిరిగి వచ్చినట్టుగా పరకాయ ప్రవేశం చేశారని చెప్పుకోవచ్చు .. ప్రజల కష్టాలు వైన్ సమయంలో బహుశా రాజశేఖరుడు ఇలానే స్పందించేవారేమో అనేలా మమ్మటు జీవించారు .

వైఎస్ తండ్రి పాత్రలో జగపతి బాబు కూడా చక్కగా ఒదిగిపోయారు ..ఉన్నది కొంత సేపే అయినా తన మార్క్ చూపించారు .కీలక పాత్రల్లో కనిపించిన సుహాసిని ,రావు రమేష్ ,పోసాని ,అనసూయ వంటి వారు ..వారి వారి పాత్రలలో ఒదిగిపోయారు ..ప్రతి ఒక్కరికి కూడా సరైన పాత్ర లభించడంతో వారు దానికి పూర్తిగా న్యాయం చేయగలిగారు ..ముఖ్యంగా సుహాసిని ఎమోషనల్ సీన్లలో తనదైన నటనను కనబరిచారు ..మిగతా నటీనటులు పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు .

ఇక సాంకేతిక విషయాలకు వస్తే .. దర్శకుడు మహి వి రాఘవ ఏదైతే చెప్పాలనుకున్నారో అది స్పష్టంగా చెప్పారు . రాసుకున్న కధని తెరపై చూపించడంలో పూర్తిగా విజయవంతమయ్యారు . చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా చూపించగలిగారు. వైఎస్‌ పాదయాత్ర నేపథ్యంలో ప్రజలతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని చాలా ఎమోషనల్‌గా వరుస సీన్లలో దర్శకుడు చూపించారు .సత్యన్ సూర్యన్ ఫొటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది .. ఎమోషనల్ సన్నివేశాలను చాల బాగా చూపించారు ..సంగీతం బాగుంది ..

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునేలా ఉంది .. ఇక ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కూడా తన కత్తెరను బాగానే ఉపయోగించి .ఏది సినిమాకు అవసరమో అదే చూపించారు ..అలాగే నిర్మాణ విలువలు బాగున్నాయి .. మహానాయకుడి జీవితాన్ని చూపించాలన్న వారి ప్రయత్నాన్ని అభినందించకుండా ఉండలేం.ఇక సినిమాను ఒక్కసారి విశ్లేషించినట్లయితే ..మొదటి సీన్ నుంచే ఎమోషనల్ బాగా క్యారీ చేశారు . అధిష్టానాన్ని ఎదిరించి పాదయాత్రకు సమాయత్తం అవడం .. కుటుంబం లోని బంధాలను బాగా చూపించారు ..

ప్రజల్లోకి వెళ్లడం ..వారి కష్టనష్టాలను వినడం చూసే వారికి కంట తడి పెట్టిస్తాయి ..ముఖ్యంగా ..మన గడపతొక్కి సాయం అడిగిన ఆడబిడ్డతో రాజకీయం ఏందిరా లాంటి డైలాగ్స్ అదిరిపోయాయని చెప్పుకోవచ్చు .. విపక్షాలపై అక్కడక్కడా కొన్ని సెటైర్స్ పడినా ..అది కధలో భాగంగా సాగింది తప్ప ..కావాలని ఇరికించినట్టు ఉండదు .రాజ‌కీయాలు లేని రాజ‌కీయ నాయ‌కుడి క‌థగా ఈ యాత్ర‌ రూపొందిందని చెప్పుకోవచ్చు .

చ‌క్క‌టి ఎమోష‌న‌ల్ కంటెంట్‌తో సాగిన ఈ చిత్రం చుసిన ప్రేక్ష‌కుడు బ‌రువెక్కిన గుండెతో బయటకు రావడం పక్కా.. మొత్తం మీద ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పవచ్చు ..ఇక ఇంతటి చక్కని సినిమాను ప్రేక్షకులకు అందించిన నిర్మాతలు ..విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డిలను అభినందించి తీరాల్సిందే ..

To Top
error: Content is protected !!