ఆంధ్ర ప్రదేశ్

వైస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా మొత్తం కలెక్షన్స్!

YSR Biopic Movie Yatra Total Collections
వైస్సార్ బయోపిక్ ‘యాత్ర’ సినిమా మొత్తం కలెక్షన్స్!

ప్రస్తుతం వెండితెరపై వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. అన్ని భాషల్లో బయోపిక్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నారు. తెలుగులో మహానటి తర్వాత క్రిష్, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రెండు భాగాలు రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు..కానీ ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ఆకర్షించలేక పోవడంతో కలెక్షన్ల పరంగా బాగా నష్టపోయింది.

ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ బయోపిక్ ‘యాత్ర’సినిమా రిలీజ్ చేశారు.మహి వి రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వైఎస్సార్ పాత్రలో మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. మరో ముఖ్య పాత్రల్లో జగపతిబాబు మరియు సుహాసిని నటించారు. ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. వైస్సార్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యం మాత్రమే తీసుకుని దర్శకుడు మహి.వి రాఘవ్ ‘యాత్ర’ సినిమాను రూపొందించాడు. వాస్తవానికి ఎన్టీఆర్ కథానాయకుడు మరియు మహానాయుకుడు ప్లాఫ్ అవటంతో యాత్ర సినిమా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఎక్కువైంది.

కాకపోతే ఈ సినిమా కొన్ని వర్గాల వారికే నచ్చుతుంది..మళ్లీ మళ్లీ చూడాలనే ఆడియన్స్ ఉండరు. దాంతో ఎంత లాగినా బ్లాక్ బస్టర్ హిట్టు కానే కాదు. ఈ సినిమా తక్కువ బడ్జెట్ లో సినిమాని నిర్మించటం కలిసొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 13 కోట్ల బిజినెస్ చేసింది. ఫుల్ రన్లో తెలుగు రాష్ట్రాల్లో 6.61 కోట్ల షేర్ ను రాబట్టింది ఈ వైస్సార్ బయోపిక్ యాత్ర సినిమా. ప్రపంచవ్యాప్తంగా 8.81కోట్ల షేర్ ను సాధించింది.

To Top
error: Content is protected !!