ఆంధ్ర ప్రదేశ్

మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు షాక్ ఇచ్చిన జగన్!

jagan shock to managala giri MLA RK
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కు షాక్ ఇచ్చిన జగన్!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టికెట్ల కేటాయింపు విషయంలో చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకుంటున్నారు. గెలిచే అవకాశం లేదని భావిస్తే సొంత వారిని సైతం పక్కన పెడుతున్నారు. తన మాట విని ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారికి సైతం జగన్ షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. తాజాగా మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈసారి సీటు వదులుకోవాలని ఆయన ఆళ్లకు సూచించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణా రెడ్డి గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆచూకీ తెలియకపోవడంతో అనుచరులు, కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. సీటు ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని వారు చెబుతున్నారు. రాజీనామా లేఖలను సిద్ధం చేసుకుని వారు ఆళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. తాడేపల్లిలోని 11 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు.

ఆర్కేకు సీటు ఇవ్వాలని నాలుగు రోజుల క్రితం ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కె) అనుచురులు జగన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలిద్దామని చెప్పి ఆయన వారిని వెనక్కి పంపించేశారు. ఈ స్థితిలో శుక్రవారం ఆర్కేను తన వద్దకు పిలిపించుకొని పద్మశాలీలకు రాష్ట్రంలో ఒక్క సీటైనా ఇవ్వలేకపోతున్నామని, నువ్వు త్యాగం చేస్తే ఈ సీటును వారికి ఇద్దామని జగన్ చెప్పారు.. దింతో ఆయన అసంతృప్తి చెంది వెనుతిరిగారని సమాచారం . ఒక పక్క చంద్రబాబు మంగళగిరి నియోజకవర్గం నుండి కాండ్రు కమల బరిలోకి దింపాలని భావిస్తుంటే జగన్మోహన్ రెడ్డి సైతం పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నాయకులను ఎన్నికల బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే ఆర్కేకు హ్యాండ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది..

To Top
error: Content is protected !!