నేషనల్

రేపు మధ్యాహ్నం 12.20కి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప స్వీకారం చేయబోతున్నారా!

yeddyurappa to take oath as karnataka cm tomorrow 12.20
రేపు మధ్యాహ్నం 12.20కి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప స్వీకారం చేయబోతున్నారా!

కర్ణాటకలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. మెజారిటీకి దగ్గర దగ్గరగా వచ్చి భారతీయ జనతా పార్టీ ఆగిపోవడంతో కాంగ్రెస్ – జేడీఎస్‌లు చేతులు కలిపాయి. ఏదేమైనా బీజేపీని గద్దెనెక్కనివ్వమని ఈ రెండు పార్టీలూ ప్రకటించేశాయి. కాంగ్రెస్, జేడీఎస్‌ల సీట్ల సంఖ్యను కలిపితే మ్యాజిక్ ఫిగర్‌ను రీచ్ కావడంతో బీజేపీలో ఆందోళన మొదలైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమ పార్టీ నిలిచినా ఆ రెండు పార్టీలూ అధికారాన్ని అందుకునే అవకాశాలు ఉండటంతో బీజేపీ నేతలు అలర్ట్ అయ్యారు.

ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఇరు వర్గాల్లో ఎవరినైనా ప్రభుత్వ ఏర్పాటుకు పిలవవచ్చు. లార్జెస్ట్ సింగిల్ పార్టీగా నిలిచిన బీజేపీకి అయినా అవకాశం ఇవ్వవచ్చు, కూటమిగా వస్తామంటున్న కాంగ్రెస్ -జేడీఎస్‌లకు కూడా అవకాశం ఇవ్వవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ మొగ్గు బీజేపీ వైపే నిలుస్తోంది.

రేపే ప్రమాణస్వీకారం అని కూడా బీజేపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది. ముహూర్తం ఖరారు అయ్యిందని కూడా సమాచారం. రేపు మధ్యాహ్నం 12.20కి కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.

To Top
error: Content is protected !!