సినిమా

యాత్ర సినిమా 3రోజుల మొత్తం కలెక్షన్స్ ఇంతే!

Yatra Movie Three Days Box Office Collections Report
యాత్ర సినిమా 3రోజుల మొత్తం కలెక్షన్స్ ఇంతే!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని కీలక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన యాత్ర చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా సానుకూలమైన స్పందన లభిస్తున్నది. ఆనందోబ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి పోషించారు.

దివంగత వైఎస్ఆర్ చేపట్టిన పాదయాత్ర నేపథ్యంగా రూపొందిన యాత్ర చిత్రం ఫిబ్రవరి 8వ తేదీన రిలీజై మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. వివరాల్లోకి వెళితే..తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చిత్రం మోస్తారు వసూళ్లను సాధిస్తున్నది. ప్రధానంగా ఏపీలో గత మూడు రోజుల్లో ఈ చిత్రం గుంటూరులో రూ.82.30 లక్షలు,, నెల్లూరులో రూ.40.78 లక్షలు, కృష్ణాలో రూ.40.78 లక్షలు, వసూళ్లను సాధించింది. సీడెడ్‌లో మూడో రోజు 28.50 లక్షలు, సాధించగా, మొత్తంగా రూ.96 లక్షలు వసూలు చేసింది.

నైజాంలో యాత్ర చిత్రం సుమారు రూ.1 కోటి వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు పేర్కొంటున్నారు. కేరళలో రూ.40 లక్షలు, మిగితా రాష్ట్రాల్లో రూ.40 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తున్నది.ఓవర్సీస్‌లో అంచనాలకు భిన్నంగా యాత్ర చిత్రం కలెక్షన్లను సాధిస్తున్నది. అమెరికాలో ఆదివారం కేవలం రూ.11.38 లక్షలు మాత్రమే సాధించింది.

మొత్తంగా ఇప్పటి వరకు మూడు రోజుల్లో రూ.1.28 కోట్లు (16k డాలర్లు) మాత్రమే వసూలు చేసింది.ఇక యూఏఈలో కూడా యాత్ర ఓ మోస్తారు వసూళ్లను సాధించింది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో రూ.28 లక్షలు రాబట్టింది. ప్రవాస తెలుగు ప్రజలు వైఎస్ఆర్ బయోపిక్‌పై ఆదరణ కనబరుస్తున్నారు. వారాంతం తర్వాత పెద్దగా ప్రేక్షకుల ఆదరణ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా యాత్ర సినిమా కలెక్షన్లను పరిశీలిస్తే మొత్తంగా రూ.6 కోట్ల గ్రాస్, రూ.3 కోట్లకుపైగా నికర కలెక్షన్లు రాబట్టినట్టు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను రూ.10 కోట్లుగా అంచనా వేశారు. ఈ చిత్రం రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లను రాబట్టగలిగితే తప్ప పెద్దగా బ్రేక్ ఇవెన్‌లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

To Top
error: Content is protected !!