నేషనల్

అభినందన్ సంచలనం వీడియో రిలీజ్ చేసిన పాక్!

భారత మాత ముద్దుబిడ్డ , ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన ఇండియాకు తిరిగి వచ్చారు ..వాఘా సరిహద్దు వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది .. అయితే అంతకముందు తమ చెరలో ఉన్న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను భారత్‌కు అప్పగించే ముందు.. పాకిస్థాన్‌ అధికారులు అతడి వీడియో ప్రకటనను చిత్రీకరించారు. సరిహద్దు దాటేముందు వీడియో ప్రకటన చేయాల్సిందిగా వారు అతణ్ని కోరినట్టు సమాచారం.

దీనివల్ల అతడి విడుదల మరింత ఆలస్యమైంది. అతడి వీడియో ప్రకటనను చిత్రీకరించి, స్థానిక మీడియాకు విడుదల చేసిన అనంతరం భారత్‌కు అప్పగించారు. అందులో ఏముందంటే.. ‘‘నా పేరు.. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌. భారత వైమానిక దళంలో యుద్ధవిమాన పైలట్‌ను. నేను లక్ష్యాన్ని వెతికే ప్రయత్నంలో ఉండగా.. పాక్‌ ఎయిర్‌ఫోర్స్‌ నా విమానాన్ని కూల్చేసింది. దీంతో.. ధ్వంసమైన నా విమానాన్ని వదిలేయాల్సి వచ్చింది. వెంటనే ఎజెక్ట్‌ అయ్యాను. నా ప్యారాచూట్‌ తెరుచుకుంది.

నేను కిందికి దిగాను. నా దగ్గర పిస్తోలు ఉంది. నన్ను నేను కాపాడుకోవడానికి ఉన్న సాధనం అదొక్కటే. కానీ, అక్కడ చాలా మంది గుమిగూడి ఉన్నారు. దీంతో, ఆ పిస్తోలును కింద పడేశాను. అక్కణ్నుంచీ పరుగెత్తడానికి ప్రయత్నించాను. అక్కడున్నవాళ్లు నా వెంట పడ్డారు. వాళ్లు చాలా కోపంగా ఉన్నారు. ఆ సమయంలో పాకిస్థాన్‌ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లు, కెప్టెన్‌ వచ్చారు. వారు నన్ను అక్కడి నుంచి కాపాడారు. నాకు ఏమీ కాకుండా చూశారు. తర్వాత వారి యూనిట్‌ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాకు ప్రథమ చికిత్స చేసి.. ఆస్పత్రికి తీసుకెళ్లారు.

వైద్యపరీక్షలు చేయించారు. అవసరమైన చికిత్స చేయించారు. పాకిస్థానీ సైన్యం మంచి ప్రొఫెషనల్‌ సైన్యం. వారిలో నేను శాంతిని చూశాను. పాకిస్థానీ ఆర్మీతో నేను చాలా సమయం గడిపాను. నాకు బాగా నచ్చింది. భారత మీడియా అన్నీ ఎక్కువ చేసి చెప్తుంది. చిన్న చిన్న విషయాలకు కూడా మసాలా చేర్చి చెప్తుంది ..అని ఆ వీడియోలో ఉంది .. పాక్ తమ గొప్పతనం చాటుకోవడానికి ఇలా చేసిందా లేక .. నిజంగానే అభినందన్ ని వీడియోలో ఉన్నట్లుగానే ట్రీట్ చేసిందా అనేది తెలియాల్సి ఉంది .

To Top
error: Content is protected !!