సినిమా

ఫిబ్రవరి 14 ఏ సినిమా విజయం సాధిస్తుంది!

which movie going to success in 14 february 2019
ఫిబ్రవరి 14 ఏ సినిమా విజయం సాధిస్తుంది!

ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం పక్కా బ్లాక్డ్. ఆ రోజు ఆరుబయట ప్రేమికులు కనిపిస్తే వెంటనే పెళ్లిళ్లు చేసేస్తామంటూ ఓవైపు మహిళా మండళ్లు పోలీసులు కాపు కాసుకుని కూచున్నారు. ఇలాంటి సన్నివేశంలో లవ్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమికులకు ఓ రెండు తెలుగు సినిమాలు ఓ హిందీ చిత్రం ట్రీటిచ్చేందుకు రిలీజ్ కి వస్తున్నాయి. ఇవి మూడూ మూడు రకాల డిఫరెంట్ ప్రేమకథా చిత్రాలు.

ప్రేమికుల దినోత్సవం కానుకగా రిలీజవుతున్న ఈ మూడు సినిమాల కథాకమామీషు ఏంటో చూద్దామా?ప్రేమ అనేది యూనివర్శల్. ఈ పాయింట్ చుట్టూ వందలాది చిత్రాలు వస్తూనే ఉన్నాయి. ప్రతియేటా మెజారిటీ భాగం ప్రేమకథలతో తెరకెక్కే సినిమాలే రిలీజవుతున్నాయి.

యువతరాన్ని థియేటర్లకు రప్పించే ప్రయత్నంలో భాగంగానే లవ్ స్టోరీల్ని తెరకెక్కించేందుకు నవతరం దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ శుక్రవారం (ఫిబ్రవరి 14)న తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండు చిత్రాలు రిలీజవుతున్నాయి. ప్రేమికుల దినోత్సవం కానుకగా వీటిని రిలీజ్ చేస్తున్నామని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. వీటిలో లవర్స్ డే దేవ్ చిత్రాలు ప్రేమకథలతో వస్తున్నాయి..

ఆ రెండిటితో పాటు తెలుగు రాష్ట్రాల మల్టీప్లెక్సుల్లో రణవీర్ – ఆలియా జంటగా నటించిన గల్లీ బోయ్స్ హిందీ వెర్షన్ రిలీజవుతోంది. లవర్స్ డే చిత్రం టీనేజీ కాలేజ్ గోయింగ్ యూత్ ని దృష్టిలో ఉంచి తెరకెక్కించిన చిత్రం. ఇప్పటికే టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుఖీభవ బిల్డర్స్ సొంత బ్యానర్ లో రిలీజ్ చేస్తున్నారు.

మలయాళ వెర్షన్ ఒరు ఆధార్ లవ్ తెలుగు వెర్షన్ లవర్స్ డే ఒకేసారి రిలీజవుతుండడంతో యూత్ లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వింక్ గాళ్ ప్రియా వారియర్ ని థియేటర్లలో వీక్షించాలని తెలుగు రాష్ట్రాల యూత్ ఆసక్తిగా ఉంది. ఈ సినిమాతో పాటు కార్తీ- రకుల్ ప్రేమికులుగా నటించిన దేవ్ అదే రోజు థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఆకట్టుకున్నాయి.

పాటలు మెప్పించాయి. బిజినెస్ మైండ్ ఉన్న మోడ్రన్ గాళ్ ని అసలే డబ్బు పిచ్చి లేని అబ్బాయి ప్రేమిస్తే ఏం జరుగుతుంది? ఉత్తర- దక్షిణ ధృవాల ప్రేమకథ ఎలా ఉంటుంది? అన్నదే ఈ సినిమా అని కార్తీ ప్రీరిలీజ్ వేడుకలో రివీల్ చేశారు. ఈ చిత్రానికి రవిశంకర్ దర్శకత్వం వహించగా లక్ష్మణ్ – ఠాగూర్ మధు నిర్మించి తమిళ్- తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

ఆలియా- రణవీర్ జంటగా జోయా అక్తర్ తెరకెక్కించిన గల్లీ బోయ్స్ నిజజీవిత స్ఫూర్తితో తెరకెక్కించిన సినిమా. ఇద్దరు ర్యాపర్స్ లైఫ్ స్టోరిని తెరపై ఆవిష్కరించారు జోయా. ఇప్పటికే ముందస్తు ప్రివ్యూల నుంచి రివ్యూలు బయటికి వచ్చేశాయి. ముంబై వీధుల్లో ర్యాపర్స్ ట్రీట్ తో పాటు..

ఈ చిత్రంలో ప్రేమకథను అద్భుతంగా బ్లెండ్ చేశారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి లవర్స్ డే రోజున అద్భుతమైన ట్రీట్ ఉండనుందని అర్థమవుతోంది. ఇక అదే రోజు వీటన్నిటినీ మించిన ప్రేమకథా చిత్రం ఆర్జీవీ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజవుతోంది. అన్నగారు ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో లక్ష్మీ పార్వతి రంగ ప్రవేశం..

ఆ ఇద్దరి మధ్యా ప్రేమను తెరపై చూపిస్తున్నాడు ఆర్జీవీ. ఇదే అసలైన ప్రేమకథా చిత్రం. ఒరిజినల్ ప్రేమను చూపిస్తున్నానని ప్రచారంలో దంచేస్తున్నాడు ఆర్జీవీ. ప్రేమికుల రోజును తనదైన శైలిలో ప్రచారానికి ఉపయోగించేస్తున్నాడు. ఎన్టీఆర్ అసలైన బయోపిక్ ఇదే! థియేటర్లలో బాంబులు పేలుస్తాం అంటూ ఆర్జీవీ ఓపెన్ స్టేట్ మెంట్ ని ఇచ్చారు.

దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఆర్జీవీ ఏం చూపించబోతున్నాడు? అంటూ యూత్ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. అయితే ఆర్జీవీ ప్రచారార్భాటంలో ఉన్నంత మ్యాటర్ సినిమాలో ఉంటే జనం థియేటర్లకు వెళ్లే వీలుంటుంది. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్- మహానాయకుడుతో పోటీకి దించేందుకు వర్మ రెడీ అవుతుండడం హాట్ టాపిక్ గా మారింది.

To Top
error: Content is protected !!