తెలంగాణ

తెరాస కి వివేక్ గుడ్ బై ?

Vivek resigns as Advisor to Telangana Govt
తెరాస కి వివేక్ గుడ్ బై ?

సార్వత్రిక ఎన్నికల ముందర తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. నేతల ఫిరాయింపులతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోంది. ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో టీఆర్ఎస్‌లోనూ అసంతృప్తి జ్వాలలు రాజుకున్నాయి. టికెట్ దక్కని ఆశావహులు కేసీఆర్ వైఖరిపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. పెద్దపల్లి టికెట్ ఆశించి భంగపడిన వివేక్ టీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సలహాదారు పదవికి వివేక్ రాజీనామా చేశారు. ఆయన తిరిగి కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వివేక్ లేఖరాశారు. ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. పెద్దపల్లి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. శనివారం అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

కాంగ్రెస్‌లో చేరి పెద్దపల్లి లోక్‌స్థానం నుంచి పోటీచేయనున్నట్లు తెలుస్తుంది .. మొదట కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివేక్..తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన.. 2014 ఎన్నికల ముందు టీఆర్ఎస్‌ని వీడి.. మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుమన్‌పై పోటీచేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ను వీడి మళ్లీ గులాబీ గూటికి చేరారు.

డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమన్ అసెంబ్లీకి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో..పెద్దపల్లి లోక్‌సభ టికెట్ తనకే వస్తుందని వివేక్ భావించారు . కానీ ఆఖరి నిమిషంలో కేసీఆర్ అతనికి షాకిచ్చారు. స్థానిక ఎమ్మెల్యేల ఫిర్యాదుల మేరకు వివేక్‌కు టికెట్ ఇవ్వలేదు.

అనూహ్యంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన వెంకటేశ్ నేతకానికి టికెట్ ప్రకటించారు. దాంతో కేసీఆర్ వైఖరికిపై అలకబూనిన వివేక్.. మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని యోచిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ పెద్దపల్లి సీటును ఇప్పటికే ఎం.చంద్రశేఖర్‌ కి కేటాయించింది ..ఈ నపద్యంలో వివేక్ చేరితే అతనికి సీటు ఇస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది .

To Top
error: Content is protected !!