సినిమా

సోదరుడి మృతితో కన్నీరుమున్నీరైన హీరో విశాల్!

vishal brother bhargav reddy lost his life
సోదరుడి మృతితో కన్నీరుమున్నీరైన హీరో విశాల్!
హీరో విశాల్ ఇంట విషాదం నెలకొంది. ఆయనకు సోదరుడు వరసైన భార్గవ్ రెడ్డి (45) మంగళవారం ఉదయం అనుమానస్పదంగా మృతిచెందారు. భార్గవ్.. మరెవ్వరో కాదు ప్రముఖ తెలుగు నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి కుమారుడు. సోమవారం రాత్రి 11 గంటలకు నెల్లూరులోని వాకాడు సముద్రం వద్దకు వెళ్లిన భార్గవ్.. మంగళవారం శవమై తేలాడు.
దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, లేదా హత్య చేశారా అనే అనుమానాలు నెలకున్నాయి. అయితే, భార్గవ్ కుక్కపిల్లను కాపాడే ప్రయత్నంలో చనిపోయారని పలువురు చెబుతున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు. భార్గవ్ తండ్రి, నిర్మాత ఎస్.గోపాల్ రెడ్డి భార్గవ్ ఆర్ట్స్ బ్యానర్‌తో హీరో బాలకృష్ణతో అనేక సినిమాలు నిర్మించారు. 2008లో ఆయన మరణం తర్వాత ఆ బ్యానర్‌తో మరే సినిమా నిర్మించలేదు.

అయితే, గోపాల్ రెడ్డి.. హీరో విశాల్‌కు బంధువులవుతారు. భార్గవ్‌తో ఎంతో సన్నిహితంగా ఉండే విశాల్.. అతడి మరణ వార్త వినగానే షాకయ్యారు. తన ఆవేదనను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘‘భార్గవ్ నీ జీవితానికి నువ్వే ముగింపు పలికి ఉండవని అనుకుంటున్నా. నా సొంత సోదరుడిని కోల్పోయా. నేనెప్పుడు ఇంత బాధపడలేదు. నిన్ను మిస్ అవుతున్నానని ట్విటర్లో చెప్పాలనిపించింది. నీ సమస్యలన్నింటినీ తీర్చేవాడిని. మెసేజ్ పెడుతుంటే ఏడుపొస్తోంది’’ అంటూ విశాల్ తన బాధను వ్యక్తం చేశాడు.

To Top
error: Content is protected !!