క్రీడలు

భారత్‌-పాక్ ల మ్యాచ్‌-క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

virat kohli clarity on bharat and pakistan match
భారత్‌-పాక్ ల మ్యాచ్‌-క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ!

ఈ నెల పుల్వామాలో 43 మంది భారత సైనికులపై దాడిని ఇండియా ఇంకా మర్చిపోవడం లేదు. ఈ ఒక్క సంఘటనతో భారత్ పాక్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అన్ని విషయాల్లోనూ పాకిస్తాన్ తో సంబంధాలను భారత్ తెంచుకుంటోంది. క్రీడల విషయంలోనూ పాకిస్తాన్ తో ఆడకూడదని దేశానికి చెందిన అన్ని క్రీడాసంఘాలు నిర్ణయం తీసుకున్నాయ.

అంతేకాదు పాక్ తో మ్యాచ్ ను భారత్ బహిష్కరించాలని మాజీలు, అభిమానులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ వ్యవహారంపై టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు.విశాఖ పట్నంలో ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య టీ20 సీరీస్ ప్రారంభకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే టీంఇండియా ఆటగాళ్లంతా వైజాగ్ కు చేరుకున్నారు.

ఈ సందర్భంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20, వన్డే సీరిస్ ల గురించి మాట్లాడారు. అనంతరం పుల్వామా దాడి, ప్రపంచ కప్ లో భారత్-పాక్ మ్యాచ్ గురించి కూడా కోహ్లీ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించాడు.

ప్రపంచ కప్ టోర్నీలో పాక్ తో మ్యాచ్ ఆడకూడదంటూ వస్తున్న డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం, బిసిసిఐ నిర్ణయం తీసుకుంటాయని విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చారు . అలాగే వారి ఆదేశాలను తాము శిరసావహిస్తామని పేర్కొన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి భారత జట్టు మొత్తం కట్టుబడి వుంటుందని కోహ్లీ వెల్లడించారు.

To Top
error: Content is protected !!