క్రీడలు

‘జీరో’ సినిమాలో నువ్వు సూపర్-విరాట్ కోహ్లీ!

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ప్రధాన పాత్రల్లో ‘జీరో’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం అభిమానుల ముందుకు వచ్చిన జీరోలో షారుక్ మరుగుజ్జు పాత్రలో మెప్పించాడు.

కాగా, ఈ సినిమాలో వికలాంగురాలిగా అనుష్క, మద్యానికి బానిసైన నటిగా కత్రినా కైఫ్ నటించారు. తాజాగా ‘జీరో’లో అనుష్క నటనపై ఆమె భర్త, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఈ రోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘ జీరో సినిమాను చూశా.. చాలా బాగా ఎంజాయ్ చేశాను. షారుక్, కత్రినా, అనుష్క.. అందరూ అద్భుతంగా నటించారు. కానీ, అనుష్క నటన మాత్రం నన్ను బాగా ఆకట్టుకుంది.

ఎందుకంటే ఆమె నటించిన పాత్ర చాలా సవాలుతో కూడుకున్నది. జీరోలో అనుష్క నటన అద్భుతం’ అంటూ అందాల శ్రీమతికి విరాట్ కితాబు నిచ్చాడు.

To Top
error: Content is protected !!