నేషనల్

విజయ్ మాల్యా బయోగ్రఫీ!

vijay mallya biography
విజయ్ మాల్యా బయోగ్రఫీ!

విజయ్ మాల్యా .. ఒక వ్యక్తి కష్టంతో ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకోగలడో .. విలాసాలతో అంతే వేగంగా పతనం చెందగలదని చెప్పడానికి సరైన ఉదాహరణగ నిలిచిన పేరు ఇది.. ..పారిశ్రామిక వర్గాలతో పాటు సామాన్య ప్రజలకు కూడా సుపరిచితమైన పెరి విజయ్ మాల్యా ..తనదైన ఆడంబరం .. విలాసవంతమైన జీవితం పారిశ్రామిక వర్గాల్లో విజయ్ మాల్యాకి ఓ ప్రత్యేక స్థానాన్ని కట్టబెట్టాయి ..

అయితే చివరకు అవే ఆడంబరాలు అతన్ని మోస్ట్ వాంటెడ్ డిఫాల్టర్ జాబితాలో చేర్చాయి .. ప్రస్తుతం దేశం వదిలి పారిపోయిన డీఫాల్టర్‌ గా విజయ్ మాల్యాని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. దేశంలోని వివిధ బ్యాంకులకు ఆయన చెల్లించాల్సిన మొత్తం రుణం అక్షరాలా 9 వేల కోట్లు. ఈ సొమ్మంతా పలు బ్యాంకులు ఎలాంటి పూచీకత్తులేకుండానే అందజేసి ఇప్పుడు మాల్యకోసం కోసం గగ్గోలు పెట్టడంతో అయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది

విజయ్ మాల్యా 1955 డిసెంబరు 18న, కోల్‌కతాలో జన్మించారు ..ఆయన వ్యాపార కుటుంబం నుంచి వచ్చారు. మాల్య కర్ణాటకలోని బంట్వాల్ అనే చిన్న పట్టణానికి చెందినవాడు. ఇతను కలకత్తా విశ్వ విద్యాలయమునకు సంబంధించిన కలకత్తాలో ఉన్న మార్తినీర్ కళాశాల లో చదువుకున్నాడు, సెయింట్.జేవియర్స్ కళాశాల, కలకత్తాలో అతని డిగ్రీ పూర్తి చేసాడు.

అలాగే దక్షిణ కాలిఫోర్నియా USC విశ్వవిద్యాలయం ద్వారా తత్వశాస్త్రములో మరియు వ్యాపార పరిపాలన శాస్త్రాల్లో డాక్టరేట్ పట్టాని పొందాడు. తండ్రి విఠల్‌ మాల్యా మరణానంతరం యునైటెడ్‌ బ్రూవరీస్‌ పగ్గాలు స్వీకరించారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 28 యేళ్లు మాత్రమే. అప్పటి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార చక్రవర్తిగా అవతరించారు.

ఆయన నేతృత్వంలో యూబీ గ్రూపు అతిపెద్ద బహుళజాతి సంస్థల్లో ఒకటిగా అవతరించింది. అయితే ఎప్పుడైతే కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ నష్టాల్లోకి జారుకోవడం మొదలయిందో.. అప్పటి నుంచి మాల్యా ప్రభావం తగ్గుతూ వచ్చింది. చివరకు కింగ్‌ఫిషర్ మూసివేత అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో యూబీ గ్రూపు ప్రధాన కంపెనీ యునైటెడ్‌ స్పిరిట్స్‌ డియాజియో చేతికి వెళ్లిపోయింది.

అయితే, దేశంలోని పలు జాతీయ, ప్రైవేట్ బ్యాంకుల ద్వారా తీసుకున్న మొత్తం రుణం అక్షరాలా వేల కోట్లు.రుణాలను మాల్యా ఎగవేసి దేశం వదిలి వెళ్లిపోయినట్టు సుప్రీంకోర్టుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి వెల్లడించారు.అయితే, బ్యాంకులు ఆయనకు ఎలా రుణాలు ఇచ్చాయో తెలుసుకోవాలనుకుంటున్నామని ధర్మాసనం పేర్కొనగా..

కింగ్‌ఫిషర్‌కున్న విమానాలు, బ్రాండ్‌ విలువను దృష్టిలో పెట్టుకుని రుణాలు ఇచ్చాయని ఏజీ చెప్పుకొచ్చారు. మాల్యా భారతదేశానికి తిరిగి రావాలని ..ప్రజల డబ్బును రికవరీ చేయాలని ప్రభుత్వ ఏజీ కోర్టుకు తెలపడం .. ఈ విజ్ఞప్తి అనంతరం ధర్మాసనం మాల్యాకు నోటీసులను జారీ చేస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది . ఇక్కడ విచిత్రమేమిటంటే..

సీబీఐ అష్ట దిగ్బంధం చేసినా మాల్యా తప్పించుకోవడమే గమనార్హం. మాల్యా దేశం వీడకుండా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమైంది. దేశం నుంచి బయటకు వెళ్లడానికి ఆస్కారం ఉన్న అన్ని నిష్క్రమణ ప్రాంతాలకూ అప్రమత్తంగా ఉండమంటూ లుక్‌ ఔట్ నోటీసులు జారీ చేసింది.

సాధారణంగా ఏ వ్యక్తి అయినా దర్యాప్తును ఎదుర్కొంటున్న పక్షంలో అతను దేశం విడిచివెళ్లకుండా ఇమిగ్రేషన్‌ అధికార వర్గాలను అప్రమత్తం చేస్తూ ఈ లుక్‌ ఔట్ నోటీసులు జారీ చేస్తారు. అయినప్పటికీ ఆయన దేశం విడిచి వెళ్లిపోవడం వెనుక పెద్ద తలల హస్తం ఉన్నట్టు అనుమానాలు తలెత్తాయి .

ఇక విజయ్ మాల్యా ఆస్తుల విషయానికి వస్తే …మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తుల వివరాలను పరిశీలిస్తే.. యునైటెడ్‌ బ్రూవరీస్‌లో 33 శాతం వాటా, దీని విలువ 7000 కోట్లు. ఇందులో సగభాగం తనఖా కిందే ఉంది. మంగళూర్‌ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌లో 22 శాతం వాటా ఉంది.

దీని విలువ 40 కోట్లు. ఇందులోనూ మూడింట ఒక వంతు తనఖా కింద ఉంది. యూబీ హోల్డింగ్స్‌లో 52 శాతం వాటా ఉంది. బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో స్థిరాస్తున్నప్పటికీ అవన్నీ కూడా తనఖా కిందే ఉన్నట్టు చెపుతున్నారు. ఇకపోతే బేయర్‌ క్రాప్‌ సైన్సెస్‌లో 1 శాతం వాటా ఉన్నప్పటికీ.. ఇప్పటికీ ఆ కంపెనీకి మాల్యానే ఛైర్మన్‌.

అలాగే మాల్యా తీసుకున్న రుణాలును గమనిస్తే …ఎస్.బి.ఐ. నుంచి 600 కోట్లు, ఐడీబీఐ, బీఎన్‌బి .800 కోట్లు , బ్యాంక్ ఆఫ్ బరోడా 550 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా 650 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ 430 కోట్లు, ఫెడరల్ బ్యాంకు 90 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ .60 కోట్లు, యాక్సిస్ బ్యాంకు 50 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ 150 కోట్లు, యూకో బ్యాంకు 320 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు140 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ 410 కోట్లు, యునైటెడ్ బ్యాంక్ .430 కోట్లు, ఫెడరల్ బ్యాంకు 90 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు 310 కోట్లుగా ఉన్నాయి .

అయితే, ఈ బ్యాంకులన్నీ కలిసి 1200 కోట్ల మేరకు వసూలు చేయనున్నట్టు చెబుతున్నాయి ..మాల్యా వైవాహిక జీవితాన్ని ఒక్కసారి గమనిస్తే .నిత్యం అమ్మాయిల వెంట తిరిగే బడా పారిశ్రామికవేత్త మాల్యా ..1986లో ఎయిర్‌హోస్టెస్‌గా పనిచేసే సమీరా త్యాబ్జిని వివాహం చేసుకున్నారు.

వీరి సంతానమే సిదార్థ మాల్యా. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. 1993లో రేఖ అనే మరో మహిళను ఆయన పెళ్లిచేసుకున్నారు. ఈమె ద్వారా మాల్యాకు ఇద్దరు ఆడపిల్లలు కలిగారు. అయితే మాల్యా కంటే ముందే రేఖకు ఇద్దరితో వివాహం కావడమే కాకుండా వారితో విడాకులు కూడా తీసుకుంది. వీరిలో మొదటి భర్తతో ఒక కూతురు, రెండో భర్తతో ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అయితే మాల్యా వీరందరినీ తన కుటుంబంగానే భావిస్తూ వస్తున్నారు.

పారిశ్రామిక వేత్తగా గుర్తింపు తెచ్చుకున్న మాల్యా రాజకీయాలలోకి అడుగుపెట్టారు 2002లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మాల్యా . ఆ తర్వాత మళ్లీ 2010లో తిరిగి రాజ్యసభ ఎంపిగా ఎంపికైన ఆయన దేశం వాడికి వెళ్లెవరకూ అదే పదవిలో కొనసాగారు . వివిధ మంత్రిత్వశాఖల కమిటీల్లో సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన రాజ్యసభ పదవీకాలం 2016 జూన్ నెలలో ముగియకముందే అయన సభ్యత్వాన్ని రద్దు చేశారు .

మాల్యాకు పలు ఆసక్తులు ఉన్నాయి వాటి వలన అయన అనేక రంగాల్లో అడుగుపెట్టటారు .2005లో విజయ మాల్య కింగ్ ఫిషర్ వైమానిక దళాన్ని స్థాపించాడు. ప్రస్తుతానికి 32 నగరాలకు ఈ వైమానిక దళ సౌకర్యాలున్నాయి. కింగ్ ఫిషర్ వైమానికదళం, నష్టాల్లో ఉన్న ఏర్ డెక్కన్ని నడిపించి 26% లాభాలను తెప్పించింది, ఏర్ డెక్కన్ ఒక తక్కువ ధరలో దొరికే భారత వైమానికదళం, దీనిని తరువాత మాల్య పూర్తిగా కింగ్ ఫిషర్ సమూహంతో కలుపుకొని దానికి కింగ్ ఫిషర్ రెడ్ అని పేరు మార్చాడు.

ఇక 2007 లో మాల్య , నెదర్లాండ్కు చెందిన మాల్ కుటుంబం కలసి స్పైకర్ F1 టీముని 88 మిలియన్ల యురోలకు కొన్నారు. 2008 నుంచి దాని పేరుని ఫోర్స్ ఇండియా F1గా ఈ టీం మార్చివేసింది. ఇక మాల్య యునైటెడ్ బ్రెవరీస్ తూర్పు బెంగాల్ మరియు కలకత్తా లోని మొహున్ బగన్ ఫుట్ బాల్ క్లుబ్బులను కూడా నిర్వహిస్తుంది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ ప్రీమియర్ లెగ్ లో అయన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేరుతో ఓ టీమ్ ని కూడా కొన్నారు .

యునైటెడ్ రేసింగ్ మరియు బ్లడ్ స్టాక్ బ్రీడర్స్ అనే కంపెనీ కూడా మాల్యాకు ఉంది, ఇది గుర్రపు పందెములకు సంబంధించింది. URBB, కునిగల్ స్టడ్ ఫాంని కర్ణాటక సర్కారు నుంచి గుత్తకు తీసుకొని నడిపిస్తోంది.అయితే ఇలాంటి కార్యక్రమాలు .. విచ్చలవిడి తనంతో వేలకోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని మాల్యా నేలమీదకు తీసుకువచ్చి ..

ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిగా మిగిలిపోయారు ..అయితే తనపై మీడియా చేస్తున్న దండయాత్రపై విజయ్ మాల్యా కూడా తనదైనశైలిలో స్పందించారు. చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ను నడపలేకపోతుండటం తప్ప దేనికి విచారపడటం లేదని చెప్పిన మాల్యా … ఎదిగిన కొద్దీ ఎలా దిగజారకూడదో అనే మాటకు సరికొత్త అర్ధంగా మిగిలిపోయారు ….

To Top
error: Content is protected !!