సినిమా

పరిటాల హత్యపై విజయ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

priyanka about paritala ravi murder in interview
పరిటాల హత్యపై విజయ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక తెలుగు హీరోయిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రియాంక జవాల్కర్ మరాఠీ అమ్మాయే అయినా కేరాఫ్ అనంతపూర్ కావడంతో మన తెలుగు అమ్మాయేనని ఏకంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జునే సర్టిఫికేట్ ఇచ్చేశాడు కాబట్టి మనం కూడా అదే ఫిక్స్ అయిపోవచ్చు.

విజయ్ దేవరకొండ లాంటి సెన్సేషనల్ హీరో.. గీతా ఆర్ట్స్ – యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద బ్యానర్ లో తెరకెక్కిన సినిమాతో ఎంట్రీ ఇస్తోంది కాబట్టి హీరోయిన్ వెంటనే గుర్తింపు వచ్చింది. ఇప్పటికే సహజత్వం కోసం కాస్త మందుకొట్టానని షాకిచ్చిన ఈ అనంతపూర్ భామ తాజాగా ఒక కొత్త యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ విషయాలు మాట్లాడింది ప్రియాంక ., అనంతపూర్ అంటే ఫ్యాక్షనిజం.. అని అడిగితే “అందరూ అదే అనుకుంటారు.” అని చెప్పింది.

ఎప్పుడైనా ఫ్యాక్షన్ గొడవల్లాంటివి చూడడం జరిగిందా అని అడిగితే.. “నేను మరిచిపోలేని సంఘటన పరిటాల రవిగారి హత్య.. ” అని చెప్పింది. ఈ విషయం చెప్పే సమయంలో కాస్త ఎమోషనల్ కూడా అయింది ..,ఇక యాంకర్ అడిగిన మరో ప్రశ్నకు బదులిస్తూ “ప్రతి ఒక్క నటి తన ప్రత్యేకతను సినిమాలో తను పోషించే క్యారెక్టర్ కు జోడిస్తుంది.. ఇప్పుడు నిత్య మీనన్ చేసినట్టు.. రకుల్ చేసినట్టు నేను చేయలేను” అని బోల్డు స్పీచ్ తో దుమ్ములేపుతుంది ఈ అనంతపూర్ హీరోయిన్ ..,

To Top
error: Content is protected !!