ఆంధ్ర ప్రదేశ్

అయోమయంలో వంగవీటి రాధా!

Vangaveeti Radha in confusion to joining TDP Party
అయోమయంలో వంగవీటి రాధా!

వంగవీటి మోహన రంగ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వంగవీటి రాధా 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇరవై ఆరేళ్ల వయసులో రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గా గెలిచిన రాధ.., 2009 నాటికి కాంగ్రెస్ పార్టీకి దూరం అయ్యారు.వంగవీటి కుటుంబానికి రాజకీయ వారసుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన రాధా దూకుడుగా వ్యవహరించేవారు.

2004-09 మధ్య దేవినేని నెహ్రూకు కాంగ్రెస్ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని రాధ సహించలేకపోయారు. అంతకు ముందు కూడా విజయవాడలో అధికారులు అంతా నెహ్రూ చెప్పు చేతల్లో ఉండటంపై బాహాటాంగా అసంతృప్తి వ్యక్తం చేసే వారు. దింతో 2009కు ముందు ప్రజా రాజ్యంలో చేరి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ప్రజా రాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడంతో., మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ల లేకపోయారు.ఆ తర్వాత వైఎస్సార్సీపీ లో చేరారు.

వైసీపీ లో రాధా కు తగిన ప్రాధాన్యత ఇచ్చినా ఆయన నిలుపోకోలేక పోయారని వాదన ఉంది. విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా ఆయన నియోజక వర్గంపై దృష్టి పెట్టకుండా వ్యవహరించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసిపి నుండి విజయవాడ సెంట్రల్ టికెట్ ఆశించాడు . దీనికి జగన్ విముఖత వ్యక్తం చేయడంతో వైసిపి రాజీనామా చేశాడు .

దింతో ఆయన భవితవ్యం సందిగ్దంలో పడింది.ఇక ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు.రంగా హత్య కేసులో తెలుగుదేశం పార్టీకి రాధా క్లీన్ చిట్ఇవ్వడంపై కాపుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. తెలుగుదేశం పార్టీలో చేరికను కాపులు వ్యతిరేకిస్తున్నారు. రాధా టీడీపీలో చేరితే తాము కాపు కాయలేమని నిర్మొహమాటంగా రాష్ట్ర వ్యాప్తంగా రంగా అభిమానులు చెబుతున్నారు.

దీనికి తోడు రాధా రాకను కృష్ణా జిల్లా కమ్మ సామాజిక వర్గం నేతలు కొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తుననట్లు తెలుస్తోంది. ఉన్న పళంగా పార్టీలో చేరి తమ అవకాశాలకు గండికొడుతున్నారని దేవినేని వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు.ఈ నేపథ్యంలో రాధా భవిషత్తు రాజకీయం అయోమయంలో పడిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు … .

To Top
error: Content is protected !!