నేషనల్

తగ్గిన పెట్రో ధరలు..!

Today petrol and diesel cost
తగ్గిన పెట్రో ధరలు..!

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మరింత తగ్గడంతో.. దేశీయంగా కూడా పెట్రోలు, డీజిల్ ధరలు సోమవారం (నవంబరు 26) మరోసారి తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 35 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.74.49 కి చేరింది. డీజిల్ ధర 41 పైసలు తగ్గి రూ.69.29 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలో 35 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.80.03 కి చేరగా.. డీజిల్ ధర 43 పైసలు తగ్గి రూ.72.56కి చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత దిగజారి బ్యారెల్‌‌ 59.53 డాలర్ల వద్ద ఉండగా.. డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర 50.73 డాలర్ల వద్ద కొనసాగుతోంది.క తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 37 పైసలు తగ్గి రూ. 78.98ఉండగా.. డీజిల్ ధర 45 పైసలు తగ్గి రూ.75.39గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.78.33 ఉండగా.. డీజిల్‌ ధర రూ.74.33 వద్ద కొనసాగుతోంది.

To Top
error: Content is protected !!