అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
నేషనల్

చరిత్రలో ఈ రోజు : జూన్ 15

history
చరిత్రలో ఈ రోజు : జూన్ 15

జూన్ 15, గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 166వ రోజు . సంవత్సరాంతమునకు ఇంకా 199 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1215: ఇంగ్లాండ్ రాజు, కింగ్ జాన్, ‘మాగ్నా కార్టా ‘ మీద తన ఆమోదం తెలుపుతూ, తన సీల్ (రాజ ముద్ర) వేసాడు.
1991: రాజీవ్ గాంధీ హత్య కేసులో, నళిని, మురుగన్ అనే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేసారు.
1908: కలకత్తా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఆరంభము.
1877: యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ అకాడమీ నుండి నల్ల జాతికి చెందిన మొట్టమొదటి పట్టభద్రుడుగా హెన్రీ ఒస్సెయిన్ ఫ్లిప్పర్.
1844: ‘ఛార్లెస్ గుడ్ ఇయర్’, రుబ్బర్ ని వల్కనైజింగ్ చేసే పద్ధతికి, పేటెంట్ పొందిన రోజు.
1836: ఉత్తర అమెరికా యొక్క 25వ రాష్టంగా ఆర్కాన్సాస్ ఆవిర్భవం.
1808: ‘జోసెఫ్ బోనపార్టె’ స్పెయిన్ కి రాజు అయ్యాడు.
1785: ప్రపంచంలో మొట్ట మొదటి విమాన ప్రమాదం (హాట్ ఎయిర్ బెలూన్ పేలిపోవటం) ఇంగ్లీష్ ఛానెల్ దాటే ప్రయత్నంలో జరిగింది. ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్జీన్ ఫ్రాంకోయిస్ పిలాట్రె డి రోజీర్, కో పైలెట్, అతని సహచరుడు పియర్ రొమెయిన్ ఉన్నారు.
1775: అమెరికన్ రివల్యూషనరీ వార్ సమయంలో, ‘జార్ఝి వాషింగ్టన్’ ని, కాంటినెంటల్ ఆర్మీ కి, కమాండర్-ఇన్-ఛీఫ్ గా నియమించారు.
1752: వర్షం సమయాన వచ్చే సమయంలో కనిపించే మెరుపులు కరెంటు అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఋజువు చేసాడు.
1667: ‘డాక్టర్ జీన్ బాప్టిస్టె డెనిస్’ మొట్టమొదటిసారిగా గొర్రె నుండి మనిషి (15 సం.ల బాలుడు) కి ‘రక్త మార్పిడి’ చేసాడు.

జననాలు
1884: తారక్‌నాథ్ దాస్, బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (మ.1958)
1897: పళ్లె పూర్ణప్రజ్ఞాచార్యులు గొప్ప కవి, పండితుడు, అవధాని.
1916: హెర్బర్ట్ సైమన్, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
1924: ద్వారం భావనారాయణ రావు, ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు మరియు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి కుమారుడు. (మ.2000)
1939: దస్తగిరి అచ్చుకట్ల చిన్న, సుషుమ సాహిత్యమాసపత్రిక సంపాదకుడు.
1974: చక్రి, తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు, రచయిత, గాయకుడు మరియు నటుడు. (మ.2014)

మరణాలు
1942: ఈడ్పుగంటి రాఘవేంద్రరావు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు, జాతీయవాది, బహుభాషా కోవిదుడు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి. (జ.1890)
1949: ఉళ్ళూర్ పరమేశ్వర అయ్యర్, ప్రముఖ మలయాళ కవి. (జ.1877)
1975: కె.ఎ.నీలకంఠ శాస్త్రి, దక్షిణ భారతదేశపు చరిత్రకారుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1892)
1983: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (జ.1910)
2010: మైనంపాటి వేంకటసుబ్రహ్మణ్యము, కవి, రచయిత, చిత్రకారుడు. (జ.1926)

పండుగలు మరియు జాతీయ దినాలు

To Top
error: Content is protected !!