అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
భక్తిరసం

ఈరోజు రాశి ఫలాలు 13 ఆగస్టు 2018!

11 january 2019 daily horoscopes in telugu
ఈరోజు రాశి ఫలాలు 13 ఆగస్టు 2018!

మేషం 

సహోద్యోగు లతో స్నేహానుబంధాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్యం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త వ్యూహాలు అమలు చేసి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం 

సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్యా ర్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. చిట్‌ఫండ్‌లు, చిన్న మొత్తాల పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. ప్రియతముల గురించి ఆంతరంగికులతో చర్చిస్తారు.

మిథునం 

కాంట్రాక్టులు లాభిస్తాయి. గృహ నిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సోదరీ, సోదరులు, బంధుమిత్రుల కలయిక ఆనందం కలి గిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది.

కర్కాటకం

కమ్యూని కేషన్లు, బోధన రంగాల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ముఖ్యమైన మెసేజ్‌లు, మెయిల్స్‌ అందు కుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి.

సింహం

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహ కరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు అను కూలం, ఆదాయం పెంపొందించుకోవడంపై స్పష్ట మైన నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు.

కన్య

రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. హాస్టళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, విహార యాత్రలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి.

తుల

మిత్రుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసు కోవాల్సి రావచ్చు. బంధుమిత్రులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అందుకుంటారు. సినిమా, టెలివిజన్‌, వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహ కరం.

వృశ్చికం

వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహకార సంఘాల్లో కీలక పదవులు అందు కుంటారు. సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది. బృంద కార్యక్రమాల్లో మాట చెల్లుబాటవుతుంది.

ధనుస్సు

లక్ష్య సాధన కోసం వ్యూహాత్మకంగా ప్రయత్నించి సత్ఫలితం సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. సమావేశాల్లో పెద్దలను కలుసుకుంటారు. ప్రభుత్వ అధికారులు, కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధిస్తారు.

మకరం

ఆర్థిక పరిస్థితి, పెట్టుబడులను సమీక్షించు కుంటారు. సమావేశాలు, ప్రయాణాలకు అను కూలం. వేడుకలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.

కుంభం 

చిట్‌ఫండ్‌లు లాభిస్తాయి. ఆస్పత్రులు, ఔషధ రంగాల వారికి, వైద్యులకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలను సమీక్షించుకుంటారు. పూర్వమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మీనం 

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం.
To Top
error: Content is protected !!