భక్తిరసం

ఈరోజు రాశి ఫలాలు 15 జూన్ 2018!

horoscopes
ఈరోజు రాశి ఫలాలు 15 జూన్ 2018!

మేషం

కాంట్రాక్టులు లాభిస్తాయి. గృహ నిర్మాణం, స్థల సేకరణకు సంబంధించిన వివరాలు సేకరిస్తారు. సోదరీ, సోదరులు, బంధుమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. బదిలీలు, మార్పులకు సంబంధించిన సమాచారం లభిస్తుంది.

వృషభం

కమ్యూనికేషన్లు, బోధన రంగాల వారికి అదనపు ఆదాయం లభిస్తుంది. ముఖ్యమైన మెసేజ్‌లు, మెయిల్స్‌ అందుకుంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. ఆర్థికపరమైన చర్చలు, ప్రయాణాలు లాభిస్తాయి.

మిథునం 

షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు అను కూలం, ఆదాయం పెంపొందించుకోవడంపై స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వ్యక్తిగత సౌకర్యాల కోసం ఖర్చు చేస్తారు.

కర్కాటకం

రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు సంబంధించి స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. హాస్టళ్లు, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, విహార యాత్రలు మనసుకు ఉల్లాసం కలిగిస్తాయి.

సింహం

మిత్రుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి రావచ్చు. బంధుమిత్రులకు సంబంధించి ముఖ్య మైన సమాచారం అందుకుంటారు. సినిమా, టెలివిజన్‌, వినోద రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం.

కన్య

వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సహకార సంఘాల్లో కీలక పదవులు అందు కుంటారు. సమావేశాల్లో పెద్దల సహకారం లభిస్తుంది.

తుల

లక్ష్య సాధన కోసం వ్యూహాత్మకంగా ప్రయత్నించి సత్ఫలితం సాధిస్తారు. ఉన్నత పదవులు అందు కుంటారు. సమావేశాల్లో పెద్దలను కలుసు కుంటారు. ప్రభుత్వ అధికారులు, కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం

ఆర్థిక పరిస్థితిని, పెట్టుబడులను సమీక్షించు కుంటారు. సమావేశాలు, ప్రయాణాలకు అను కూలం. సమావేశాలు, వేడుకలకు అవసరమైన నిధులు చేతికి అందుతాయు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.

ధనుస్సు 

చిట్‌ఫండ్లు లాభిస్తాయి. ఆస్పత్రులు, ఔషధ రంగాల వారికి, వైద్యులకు అనుకూలం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలను సమీక్షించుకుంటారు. పూర్వ మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

మకరం 

కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పందాలు, పాటీల్లో విజయం సాధిస్తారు. కొత్త పరిచయాలు లాభిస్తాయి. వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నూతన భాగస్వామ్యాలకు అనుకూలం.

కుంభం 

సహోద్యోగులతో స్నేహానుబంధాలు విస్తరి స్తాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వైద్యం, పరిశ్రమలు, హోటల్‌, కేటరింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరం. కొత్త వ్యూహాలు అమలు చేసి వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.

మీనం

సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. విద్యార్థులు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. చిట్‌ఫండ్‌లు, చిన్నమొత్తాల పొదుపు పథకాల గురించి ఆరా తీస్తారు. ప్రియతముల గురించి ఆంతరంగికులతో చర్చిస్తారు.
To Top
error: Content is protected !!