నేషనల్

చరిత్రలో ఈ రోజు : మార్చి 24

today history in telugu 24 march 2019
చరిత్రలో ఈ రోజు : మార్చి 24

మార్చి 24, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 83వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 282 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1882: క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా ట్యుబర్‌క్యులాసిస్ ని రాబర్ట్ కోచ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1896 చరిత్రలో మొదటి రేడియో ప్రసార సంకేతాలను ఎ.ఎస్.పోపోవ్ సృష్టించాడు.
1977: భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ పదవీ విరమణ.
1977: భారత ప్రధానమంత్రిగా మొరార్జీ దేశాయ్ నియమితుడైనాడు.
1997: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎ.జె.ఎం. అహ్మది పదవీ విరమణ.
1998: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
1998: పశ్చిమ బెంగాల్లో దంతన్ ప్రాంతంలో భయంకర టోర్నడో ఫలితంగా 250 మంది ప్రజల మరణం.3000 మంది గాయపడ్డారు.
2008: ఆరవ వేతన సంఘం (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల సవరణకోసం ఏర్పాటు చేసిన సంఘం), తన నివేదికను ఈ రోజున ఆర్థిక శాఖామంత్రికి సమర్పించింది.

జననాలు
1775: ముత్తుస్వామి దీక్షితులు, భారత దేశానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, వాగ్గేయకారుడు. (మ.1835)
1914: పుట్టపర్తి నారాయణాచార్యులు, తెలుగు పదాలతో ‘‘శివతాండవం’’ ఆడించిన కవి, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు.
1984: ఆడ్రియన్ డీసౌజా, భారత హాకీ క్రీడాకారుడు.

మరణాలు
1603: ఇంగ్లాండ్ యొక్క ఎలిజబెత్ I, ఇంగ్లాండు మహారాణి. (జ.1533)
1963: అవసరాల సూర్యారావు, ప్రధానంగా నాటక కర్త అయిన వీరు నల్లబూట్లు, పంజరం మొదలైన నాటికలు రాశారు. పంజరం ఆంధ్ర నాటక పరిషత్తు వారి బహుమానం పొందింది.
2016: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.1950)
2017: గ్రంధి సుబ్బారావు వ్యాపారవేత్త, దాత, ఆధ్యాత్మికవేత్త. క్రేన్ వక్కపొడి ద్వారా సుప్రసిద్ధుడు.

పండుగలు మరియు జాతీయ
ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం

To Top
error: Content is protected !!