నేషనల్

చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 11

today history in telugu 11 february 2019
చరిత్రలో ఈ రోజు : ఫిబ్రవరి 11

ఫిబ్రవరి 11, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 42వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 323 రోజులు మిగిలినవి.

సంఘటనలు
1922: సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేయాలని బార్డోలీలో జరిగిన కాంగ్రెసు సమావేశం నిర్ణయించింది.
1975: మార్గరెట్ థాచర్ బ్రిటన్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
1990: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి నెల్సన్ మండేలాకు స్వేచ్ఛ లభించింది.

జననాలు
1847: థామస్ ఆల్వా ఎడిసన్, విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ కనిపెట్టిన అమెరికన్ శాస్త్రవేత్త మరియు వ్యాపారవేత్త. (మ.1931)
1865: పానుగంటి లక్ష్మీ నరసింహారావు, ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత. (మ.1940)
1899: గురజాడ రాఘవశర్మ, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు గురజాడ అప్పారావు గారి వంశీకులు. (మ.1987)
1917: తరిమెల నాగిరెడ్డి, ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు. (మ. 1976)
1932: రావి కొండలరావు, తెలుగు సినిమా నటుడు మరియు రచయిత.
1958: పెన్మెత్స సుబ్బరాజు, బైబిల్ పై అనేక విమర్శనా గ్రంథాలు రాశారు.

మరణాలు
1868: లీయాన్ ఫోకాల్ట్, ప్రాన్స్ కు చెందిన భౌతిక శాస్త్రవేత్త. (జ.1819)
1942: జమ్నాలాల్ బజాజ్, ప్రముఖ వ్యాపారవేత్త, భారత స్వాతంత్య్ర సమరయోధుడు. (జ.1889)
1974: ఘంటసాల వెంకటేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా సంగీత దర్శకుడు మరియు నేపథ్య గాయకుడు. (జ.1922)
1977: ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, భారత ఐదవ రాష్ట్రపతి. (జ.1905)
1996: ఆలపాటి రవీంద్రనాధ్, జ్యోతి, రేరాణి, సినిమా, మిసిమి పత్రికల స్థాపకుడు. (జ.1922)
2010: లక్ష్మీదేవమ్మ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ.
2018: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)

పండుగలు మరియు జాతీయ

  • ప్రపంచ వివాహ దినోత్సవం
To Top
error: Content is protected !!