అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌-ఆఫర్లే ఆఫర్లు!'ఎఫ్ 2' ట్రైలర్-చూస్తే పడి పడి నవ్వుకుంటారు!విరాట్ కోహ్లీ మరియు అనుష్కల పెళ్లి వీడియో!పవన్ కోసం రంగంలో దిగిన గబ్బర్ సింగ్ బ్యాచ్ !!రి ఎంట్రీ ఇచ్చిన రేవంత్ …కెసిఆర్, చంద్రబాబు మీద 10 ఇయర్స్ ఛాలెంజ్కీలక పాత్రలో అందాలను ఆరబోయనున్న శివగామి …వివిఆర్ 8th డే కలెక్షన్స్…, చెక్కుచెదరని రాంచరణ్ స్టామిన…!ఈరోజు మార్కెట్ లో బంగారం మరియు వెండి ధరలు!బిగ్ బాస్ పూజ కాపురంలో చిచ్చు ..,కేసీఆర్ అమరావతి పర్యటనకు ముహూర్తం ఖరారు …!బాలయ్యకు షాక్ ఇస్తున్న ఎన్టీఆర్ కథానాయకుడు కలెక్షన్స్..?దుమ్మురేపుతున్న విక్రమ్‌ ‘కదరమ్ కొండమ్’టీజర్
ఇంటర్నేషనల్

షాక్.. దేశంలో వాట్సాప్‌పై నిషేధం ? త్వరలో..!

షాక్.. దేశంలో వాట్సాప్‌పై నిషేధం ? త్వరలో..!

సోషల్ మీడియాలో ఎదురులేని ప్లాట్ ఫారం ఇప్పుడు
వాట్సాప్… ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రాం ఎట్సెట్రాలకన్నా
వేగంగా పాపులర్ అయిపోయిన ఓ వెబ్ యాప్… మెసేజీలకే కాదు, కాల్స్‌కూ
ఇప్పుడదే దిక్కయ్యింది… దేశదేశాల్లో ఉన్నవాళ్లతో మాట్లాడటానికే
కాదు, లోకల్ కాల్స్‌కు కూడా అదే ప్రధానంగా మారిపోయిందిప్పుడు…
గ్రూపులు, గ్రూపు మెసేజీలు సరేసరి… అయితే దాన్ని నిషేధిస్తే ఎలా
ఉంటుందని మన కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా ఆలోచిస్తున్నదీ అనేది
తాజాగా చక్కర్లు కొడుతున్న వార్త…

ఈమధ్య ఎక్కడ అల్లర్లు జరుగుతున్నా, జరిగే చాన్సుందని అనుమానించినా
పోలీసులు వెంటనే సోషల్ మీడియాపై ఆంక్షలు పెట్టేస్తున్నారు…
కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో రోజుల తరబడీ నెట్ సేవల్నీ
ఆపేస్తున్నారు… కారణం… తప్పుడు వార్తల్ని, సమాచారాన్ని స్ప్రెడ్
చేస్తూ అల్లర్లను రెచ్చగొట్టడమే… పైగా సంఘ వ్యతిరేక శక్తులు
పోలీసు నిఘాకు దొరక్కుండా దీన్ని వాడుకుంటూ తమ పనులు
చక్కపెడుతున్నాయి… ఇటీవల ఓ ఆర్మీ క్యాంపు మీద జరిగిన దాడికి
వాట్సాప్ బాగా ఉపయోగపడిందని ఆర్మీ, పోలీసు అధికారులు నిర్ధారణకు
వచ్చారు… ఇందులో End To End Encryption సౌకర్యం ఉండటం వల్ల,
వాటిని మధ్యలోనే ఎవరూ సంగ్రహించి, చదివే చాన్స్ లేకుండా
పోతున్నది… నిఘాకూ ఆస్కారం లేకుండా పోతున్నది… వీడియోలు, ఫోటోలు
పంపించుకునే వెసులుబాటు, కాల్స్ చేసుకునే సౌకర్యం, గ్రూపుల వారీగా
మెసేజింగ్ ఆప్షన్ ఉన్న వాట్సాప్ తీవ్రవాదుల చేతులకూ ఓ అస్త్రంగా
మారిందని హోం శాఖ ఆందోళన… నిజానికి ఈ వాట్సాప్ మాత్రమే కాదు, ఇతర
సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు కూడా అల్లర్లకు ఆజ్యం పోస్తున్నాయి…
తప్పుడు వార్తల్ని స్ప్రెడ్ చేస్తున్నాయి… భావప్రకటన స్వేచ్ఛ
పేరిట మితిమీరిన, నియంత్రణ లేని స్వేచ్ఛ దుష్పరిణామాలకు
దారితీస్తున్నది… కల్లోలాలను క్రియేట్ చేసే ఎత్తుగడల్ని కూడా
సంఘవ్యతిరేక శక్తులు సోషల్ మీడియా వేదికగా అమలు చేస్తున్నాయి…
నిజమే… దీనికి కట్టడి అవసరం… కానీ మొత్తం సోషల్ మీడియా జోలికి
పోవాలంటేనే జనం వణికిపోయే స్థాయిలో ఆంక్షలు పెట్టకుండా… ఏవైనా
పకడ్బందీ కట్టడి మార్గాలపై ఆలోచన అవసరం… ప్రజోపయోగకరమైన ఓ
బహుళసేవల వేదికను ఏకమొత్తంగా నిషేధించడం అనేది ఉత్తమ పరిష్కారం
కాకపోవచ్చు..!

To Top
error: Content is protected !!