ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో ఉద్రిక్తత..

తాడిపత్రిలో ఉద్రిక్తత..

తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వైసీపీ ఇన్‌చార్జ్ పెద్దారెడ్డిపై కేసులు మోపడంతో ఆయన అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం సబ్‌జైల్‌లో పెద్దారెడ్డి ఉన్నారు. ఇదే సమయంలో జేసీ వర్గీయులు తమ మాట వినని వారిపై దాడులకు దిగుతున్నారు.తాడిపత్రి మండలం చిన్నపొడమల, పెదపొడమల గ్రామాలకు చెందిన జేసీ వర్గీయులు శనివారం శ్రీశ్రీప్రబోధానంద ఆశ్రమంపై దాడి చేశారు.

ట్రాక్టర్లు, ఆటోలు, బైకులు, షాపులు తగలబెట్టారు. జేసీ వర్గీయుల రాళ్ల దాడిలో 15 మంది గాయపడ్డారు. సీఐ సురేంద్రనాథ్‌ రెడ్డి సమక్షంలోనే ఈ దాడులు జరిగాయి. వెంటనే సంఘటనాస్థలిని పరిశీలించిన జిల్లా ఎస్పీ …. సీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ధ్యానం చేసుకునే ఆశ్రమం గుండా వివాదాస్పద మార్గంలో వినాయక నిమజ్జనానికి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు. అయితే ఆదివారం నేరుగా జేసీ దివాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆశ్రమం వద్ద రోడ్డుపై అనుచరులతో కలిసి బైఠాయించారు. గ్రామస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జేసీ దివాకర్‌ రెడ్డి సమక్షంలోనే మరోసారి శ్రీశ్రీప్రబోధానంద ఆశ్రమంపై జేసీ వర్గీయులు రాళ్ల దాడి చేశారు. దీంతో ఆశ్రమంలో ధ్యానం చేసుకునే వారు భయంతో పరుగులు తీశారు.

To Top
error: Content is protected !!