కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

మిథాలీకి కేసీఆర్ కోటి న‌జ‌రానా!

telangana government announces RS1 crore for mithali raj
మిథాలీకి కేసీఆర్ కోటి న‌జ‌రానా!

ఇండియ‌న్ మ‌హిళ‌ల‌ క్రికెట్ ర‌థ సార‌ధి కేప్టెన్ మిథాలీరాజ్‌కు ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ కోటి రూపాయ‌ల‌ నజరానా ప్రకటించారు. తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున‌ హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 600 గజాల స్థ‌లం కూడా ఇవ్వనున్నట్టు చెప్పింది. కోచ్ మూర్తికి కూడా రూ.25 లక్షల నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు పేర్కొన్నారు. మహిళా క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తిగతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు మిథాలీరాజ్‌ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. జులై 28న హైదరాబాద్ చేరుకున్న మిథాలీరాజ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మిథాలీరాజ్‌తోపాటు కోచ్ ఆర్‌ఎస్‌ఆర్ మూర్తిని.. సీఎం శాలువాకప్పి సన్మానించారు. మిథాలీని అద్భుత క్రికెటర్‌గా తీర్చిదిద్దారని మూర్తిని ప్రశంసించారు కేసీఆర్. ప్రపంచకప్‌లో మిథాలీ అద్భుతంగా రాణించింద‌న్నారు. ఫైనల్లో గెలువడం ఖాయం అనుకున్నాం. దురదృష్టవశాత్తు కొద్ది తేడాతో ఓడిపోయాం అన్నారు. అయినప్పటికీ జట్టంతా అద్భుతంగా ఆడిందని తెలిపారు సీఎం. నాతోపాటు దేశమంతా భార‌త మ‌హిళ‌ల క్రికెట్ ను చూసిందన్నారు. ఫైన‌ల్లో హోరాహొరిగా జ‌రిగిన ఫైన‌ల్లో దేశం యావ‌త్తు మద్దతుగా నిలిచింద‌న్నారు. ముఖ్యంగా టోర్నీలో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రికార్డు సొంతం చేసుకున్న మిథాలీని ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించారు. హైదరాబాద్ నగరానికి, తెలంగాణ రాష్ట్రానికి మిథాలీ గర్వకారణం అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు. వ్యక్తిగతంగా, తెలంగాణ ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. ప్ర‌భుత్వం మిథాలీకి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!