తెలంగాణ

మల్కాజ్‌గిరిని ముంచెత్తిన ఆకస్మిక వరద

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది.గంటపాటు కురిసిన భారీ వర్షానికి బండ్ల చెరువు ఉప్పొంగడంతో మల్కాజ్‌గిరిలోని ఈస్ట్ ఆనంద్‌బాగ్‌ షిర్డీ నగర్ కాలనీ నీట మునిగింది. కాలనీలోని రోడ్లు చిన్న సైజు నదులను తలపించాయి. ఇళ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.మరోవైపు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యయి. నాచారం, ఉప్పల్, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఖైరతాబాద్‌, ఎర్రగడ్డ, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, సఫిల్‌గూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బాలా నగర్ వై జంక్షన్ సమీపంలో రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
సికింద్రాబాద్‌లో అత్యధికంగా 9 సెం.మీ. వర్షం కురిసింది. ముషీరాబాద్‌లో 8, అంబర్‌పేటలో 7.2, ఖైరతాబాద్‌లో 7, అమీర్‌పేటలో 6.3 సెం.మీ. వర్షం పడింది. నాంపల్లిలో 5 సెం.మీ., హిమయత్‌నగర్ 4.5 సెం.మీ., సైదాబాద్, చార్మినార్, బండ్లగూడలో 3 సెం.మీ చొప్పున వర్ష కురిసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!