కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భార‌త్ కు రెండు ప‌త‌కాలు

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భార‌త్ కు రెండు ప‌త‌కాలు

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు… దేశ బ్యాడ్మింటన్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఆగ‌స్టు 27న ముగిసిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకంతో సంచలనం సృష్టించింది సింధు. హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగోసీడ్ సింధు 19-21, 22-20, 20-22తో ఏడోసీడ్ నొజొమి ఒకుహర (జపాన్) చేతిలో పోరాడి ఓడింది. ఈ పోరులో ఆమె రెండోస్థానంతో సరిపెట్టుకుంది. భారత్ తరఫున ఫైనల్ చేరిన రెండో క్రీడాకారిణిగా రికార్డులకెక్కిన సింధు గతంలో రెండుసార్లు ఇదే చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలను సాధించింది. ఓవరాల్‌గా సైనా కాంస్యంతో కలిపి ఈసారి చాంపియన్‌షిప్‌లో భారత్ ఎప్పుడు లేని విధంగా రెండు పతకాలు గెలిచి మరో రికార్డును సొంతం చేసుకుంది. గతంలో భారత్‌కు రజతంతో పాటు నాలుగు కాంస్యాలు లభించాయి. 1983లో ప్రకాశ్ పదుకొనే భారత్‌కు తొలి కాంస్యాన్ని అందించాడు. 2011లో డబుల్స్‌లో అశ్విని-జ్వాల జోడి మళ్లీ కాంస్యంతో మెరిసింది. గంటా 50 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సింధు ఆద్యంతం ఆకట్టుకుంది. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన సింధు 3-5తో వెనుకబడ్డా.. వరుసగా 8 పాయింట్లు నెగ్గి 11-5 ఆధిక్యంలోకి వెళ్లింది. తన ఎత్తును ఆసరాగా చేసుకున్న తెలుగమ్మాయి కోర్టులో చురుకుగా కదులుతూ షటిల్ ఎక్కడ పడిన సులువుగా తీసుకుంది. ఫలితంగా క్రాస్ కోర్టు రిటర్న్స్‌తో ఒకుహరను కట్టడి చేస్తూ 13-8 ఆధిక్యాన్ని సాధించింది. అయితే ఐదడుగుల జపాన్ అమ్మాయి సుదీర్ఘ ర్యాలీల వైపు మొగ్గడంతో రిటర్న్ సర్వీస్‌లను తీయడంలో సింధు తడబడింది. దీంతో ఒకుహర 13 పాయింట్లలో 10 గెలిచి 18-14 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒకుహర అనవసర తప్పిదాలు చేయడంతో పుంజుకున్న సైనా 19-19తో గేమ్‌లోకి వచ్చింది. కానీ తన సర్వీస్‌లో షటిల్‌ను నెట్‌కు కొట్టడంతో మూల్యం చెల్లించుకుంది. రెండో గేమ్‌లో తను కొట్టిన ఫోర్‌హ్యాండ్ రిటర్న్స్ తీయడంలో ఒకుహర ఇబ్బందిపడటంతో సింధు 5-1, 9-3 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇదే జోరును కొనసాగిస్తూ ఒకుహరను నెట్ వద్ద కట్టడి చేసింది. దీంతో 11-8 ఆధిక్యం దక్కింది. ఇక స్కోరు 15-13 ఉన్న దశలో సుదీర్ఘమైన ర్యాలీ సింధు సొంతమైంది. కానీ జపాన్ అమ్మాయి కచ్చితమైన యాంగిల్స్‌లో మరింత బలంగా షాట్లను సంధించింది. దీంతో సింధు ఆధిక్యం 18-16కు తగ్గించింది. ఈ దశలో నెట్ వద్ద రెండు సూపర్ డ్రాప్ చేయడంతో సింధుకు రెండు పాయింట్లు వచ్చాయి. దీంతో స్కోరు 20-17 అయ్యింది. కానీ పట్టువిడవకుండా పోరాడిన ఒకుహర వరుసగా మూడు పాయింట్లు సాధించి 20-20తో స్కోరును సమం చేసింది. చివరకు గేమ్ పాయింట్ కోసం 73 ర్యాలీలు ఆడిన సింధు మొత్తానికి పైచేయి సాధించి మ్యాచ్‌లో నిలిచింది. 5-1 ఆధిక్యంతో మూడో గేమ్‌ను ఆరంభించిన ఒకుహర… సింధును ఒత్తిడిలో పడేసింది. కానీ నెట్ వద్ద ఊహించని స్థాయిలో రిటర్న్స్ తీసిన తెలుగమ్మాయి 5-5తో స్కోరు సమం చేసింది. ఇక్కడి నుంచి ర్యాలీల్లో ఆధిపత్యం చూపెట్టిన సింధు 11-9తో ముందుకెళ్లింది. సైడ్‌లు మారిన తర్వాత బ్యాక్‌హ్యాండ్ బాడీ స్మాష్‌లతో చెలరేగిన ఒకుహర 13-12 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు పోరాటం చేయడంతో స్కోరు 17-17 వద్ద సమమైనా సింధు మరింత జోరు చూపుతూ 19-17తో ముందంజ వేసింది. కానీ ఒకుహర కచ్చితమైన క్రాస్ కోర్టు షాట్స్‌తో మరోసారి స్కోరును సమం చేసింది. ఈ దశలో సింధు నెట్ వద్ద తప్పిదం చేయడంతో ఒకుహరకు మ్యాచ్ పాయింట్ దక్కింది. కానీ ఓపికగా పోరాడిన సింధు సుదీర్ఘమైన ర్యాలీతో ప్రత్యర్థిని బేస్‌లైన్ వద్ద కట్టడి చేసి 20-20 స్కోరు చేసింది. అయితే జపాన్ అమ్మాయి కొట్టిన షాట్‌ను తీసే క్రమంలో సింధు మరోసారి నెట్‌కు కొట్టడం, తర్వాతి షాట్‌ను ఒకుహర కచ్చితమైన బ్యాక్‌హ్యాండ్ షాట్ సంధించడంతో సింధుకు నిరాశ మిగిలింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!