తెలంగాణ

ఫ్రెండ్స్ ని కలుస్తా వెళ్లిన అమ్మాయి..శవంగా మారింది..! చంపింది ప్రియుడే..! ఏమైందో తెలుసా?

చాందిని, సాయికిరణ్ 2015 నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే చాందిని ప్రవర్తన నచ్చక గత 6 నెలలుగా చాందినిని దూరం పెడుతున్నాడు. అయినా చాందిని తన వెంట పడుతుందని, ఎలాగైనా వదిలించుకోవాలని చూశాడు. ఈ విషయంపై మాట్లాడాలని చెప్పి ఈనెల 9న అమీనాపూర్ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేశాడు. కాగా, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సాయికిరణ్‌ను పోలీసులు మీడియా ముందుకు తీసుకురానున్నారు.అయితే హత్యచేసిన అనంతరం చాందిని ఇంటికి సాయికిరణ్ వెళ్లడం గమనార్హం. తనపై ఎలాంటి అనుమానం రాకుండా చాందిని కుటుంబ సభ్యులను కలిశాడు. తమ బిడ్డకి మంచి ఫ్రెండ్‌గా ఉండే సాయికిరణ్ ఈ హత్య చేశాడంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని చాందిని తల్లి విలపించారు. ఈ హత్యను సాయికిరణ్ ఒక్కడే చేసి ఉండడని, ఇంకా ఎవరైనా ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, మదీనాగూడకు చెందిన చాందిని జైన్‌ మృతదేహాన్ని మంగళవారం ఉదయం అమీనాపూర్ గుట్టల్లో పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. మదీనాగూడలోని సత్యనారాయణ ఎన్‌క్లేవ్‌కు చెందిన హోల్‌సేల్‌ వస్త్ర వ్యాపారి కిషోర్‌జైన్‌ కుమార్తె చాందిని జైన్‌(17). సెప్టెంబర్ నెల 9న సాయంత్రం 5 గంటల సమయంలో స్నేహితులను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన చాందిని ఇంటికి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అదే రోజు మియాపూర్‌ పోలీసుస్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తర్వాత అమీన్‌పూర్‌ గుట్టల్లో ఆమె శవమై కనిపించింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన రోజు చాందిని ఓ యువకుడితో అమీనాపూర్ గుట్టలవైపు వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపించడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. బాలిక సెల్‌ఫోన్ ఆధారంగా పలువురు అనుమానితుల్ని విచారించారు. చివరికి ప్రియుడు సాయికిరణ్‌ ఆమెను అమీన్‌పూర్‌ గుట్టల్లోకి తీసుకెళ్లి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!