పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కినిరాశే మిగిలింది...!సౌదీ అరేబియాలో మ‌హిళ‌లు చేయ‌కూడ‌ని ప‌నులేంటో తెలుసా.....?ప్ర‌ధాని గొంతు కోయ‌డానికి బీహారీలు సిద్ధంగా ఉన్నారు....ర‌బ్రీ దేవి తీవ్ర‌వ్యాఖ్య‌లుజూలీ 2 ఇది ఒక సౌత్ హీరోయిన్ రియల్ స్టోరీ..తీవ్ర అసంతృప్తిలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి..!! వైసీపీకి గుడ్‌ బై ..?చంద్రబాబు రెండు సార్లు చూసిన ఆ సినిమా ఏది ?గూగుల్ ప్లే స్టోర్ లో ప్ర‌త్య‌క్ష‌మైన‌ యూసీ బ్రౌజ‌ర్....!!నయనతార పారితోషికంపై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్.ఈమె మోడ‌లింగ్ ద్వారా సంవ‌త్స‌రానికి ఎంత సంపాదించిందో తెలుసా.....??ఐన్ స్టీన్ త‌న భార్యకు ఎంత దారుణ‌మైన కండీష‌న్స్ పెట్టాడో తెలుసా...??
తెలంగాణ

తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌ కు 70 ఏళ్లు

70 years for telangana jalianvala bhag
తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌ కు 70 ఏళ్లు

ఆ మట్టి.. చైతన్యానికి ప్రతీక..ఆ మట్టి రజాకార్లు పారించిన రక్తపుటేర్లకు సాక్ష్యం.. నిజాం నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం.. సాతంత్ర్యాన్ని కాంక్షించి అమరులైన యోధుల పోరాటానికి ప్రత్యక్ష సాక్ష్యం.. అదే మరో జలియన్‌వాలాబాగ్‌ ఘటనగా చరిత్రలో నిలిచిపోయిన పరకాల ఊచకోత ఘటన. సరిగ్గా 70 ఏళ్ల క్రితం.. 1947లో ఇదే రోజున (సెప్టెంబరు2న) జాతీయ పతాకాన్ని ఎగురవేయాలనే కాంక్షతో చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిమంది ప్రజలు తరలివచ్చారు. ఆ ప్రజలపై రజాకార్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆ సంఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. కానీ నైజాం స్టేట్ లో ఉన్న ప్రజలకు మాత్రం స్వాతంత్య్రం రాలేదు. స్వాతంత్య్రాన్ని కోరుకున్న జనం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రయత్నించినందుకే రజాకార్లు అతి దారుణంగా కాల్చి చంపారు. ఈ చారిత్రక ఘటన స్మారకార్థం 16 ఏళ్లక్రితం అమరుల ఊచకోత జరిగిన ప్రాంతంలో అప్పటి బీజేపీ నేత, ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావు ఆనాడు కేంద్రమంత్రి హోదాలో అమరధామాన్ని నిర్మించారు. ఏటా సెప్టెంబరు 2న అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు నాటి ఘటనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తుంటారు.తెలంగాణ జలియన్‌వాలాబాగ్‌ కు 70 ఏళ్లు నిండాయి ..రజాకార్ల దాడికి సజీవ సాక్ష్యం పరకాల అమరధామం..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To Top
error: Content is protected !!