తెలంగాణ

డ్రగ్ హీరో అకుల్ సబర్వాల్ జీరో ఎలా అయ్యాడో తెలుసా..??!!

drug case officer akun sabharwal history
డ్రగ్ హీరో అకుల్ సబర్వాల్ జీరో ఎలా అయ్యాడో తెలుసా..??!!

కొద్ది రోజుల పాటు మీడియాలో అకున్ సభర్వాల్ హీరో అయిపోయాడు.. వరుసబెట్టి సినీజీవులను విచారణకు రప్పించాడు.. ఏదో జరగబోతున్నది, ఎవరినో దోషులుగా తేల్చేయబోతున్నారు అనే హైప్ క్రియేటయిపోయింది.. అది బెలూన్‌లాగా ఉబ్బేకొద్దీ చాలామందికి ఓ విషయం స్పష్టమైపోయింది..ఇది తేలే వ్యవహారం కాదూ అని.. ఇప్పుడంతా సైలెంట్.. వాళ్లంతా సాక్షులే అనే వాదన తెరపైకి వచ్చి, మొత్తం తుస్సుమనిపించింది.. మరి ఈ మాత్రం నిర్వాకానికి సినిమావాళ్లను ఎందుకు బలిపశువులను చేసినట్టు, ఎందుకు బజారుకు లాగినట్టు..? ఎలుకను కూడా పట్టుకోలేనప్పుడు ఈ కొండంతా ఎందుకు తవ్వినట్టు..? ఇదీ ఇప్పుడు ఎక్సయిజు శాఖ ప్లస్ పోలీసు శాఖల్లో చర్చ సీనియర్ ఐపీఎస్ అధికారి, సివిల్ సప్లయిస్ కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ దర్యాప్తు తీరుపై తాజాగా చేసిన వ్యాఖ్యలు అకున్ సభర్వాల్ దర్యాప్తు తీరుపైనే అనేక సందేహాలను, ప్రశ్నలను లేవనెత్తతున్నాయి.. నిజానికి అకున్ సభర్వాల్ పోకడపై, ఏకపక్ష నిర్ణయాలపై, దుందుడుకు ధోరణిపై తన ఇమీడియెట్ బాస్, ఎక్సయిజు కమిషనర్ చంద్రవదన్ సైతం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడనే వార్తలు కూడా వచ్చాయి ఆమధ్య.. ఇప్పుడు సీవీ ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో ఇంట్రస్టింగు వ్యాఖ్యలు చేశారు నిజానికి ఒక ఐపీఎస్ అధికారికి, మరో ఐపీఎస్ అధికారికీ విభేదాలున్నా ఇలా బహిరంగంగా బయటపడరు.. ఆనంద్‌కూ, అకున్‌కూ నడుమ విభేదాలేమీ ఉన్నట్టు కూడా లేదు.. ఒక ఐపీఎస్ ఒక కేసును దర్యాప్తు చేసే తీరుపై మరో ఐపీఎస్ అధికారి ఇలా తప్పులెన్నడం కూడా బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.. ‘‘కేసు హ్యాండిల్ చేసిన విధానం సరిగ్గా లేదు.. ఎక్కువ ఎక్స్‌పోజ్ చేసి దర్యాప్తు చేస్తే ఏ కేసైనా రిజల్ట్ అంతే అవుతుంది.. నేనయితే ఇలా హ్యాండిల్ చేయను.. ఇంత ప్రెజర్ బిల్డప్ చేస్తే సొసైటీ నుంచి, అడ్మినిస్ట్రేషన్ నుంచి వేర్వేరు అభిప్రాయాలొస్తాయి.. ఇక్కడ సెన్సేషనలిజం, పాపులారిటీ కాదు మొత్తం రాకెట్ బయటపడాలనే విధంగా డీల్ చేసేవాడిని.. సీక్రెట్‌గా చేయొచ్చు.. ఇదంతా సినిమావాళ్లకు నోటీసులు.. మీడియాలో ఎందుకు రావాలి..? కేసు పరిష్కరించడం గాకుండా సెన్సేషనలిజం అనేది రాంగ్ డైరెక్షన్’’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.. ఆనంద్ చెబుతున్న దాంట్లో అబద్ధం ఏమీ లేదు.. అయితే ఒక అధికారి ఒక కేసును డీల్ చేసే విధానానికి, అదే కేసు వేరే అధికారి డీల్ చేసే విధానానికీ కచ్చితంగా తేడా ఉంటుంది.. దీనికి యూనిఫార్మిటీయో, సిమిలారిటీయో, స్టాండర్డ్ మెథడో ఏమీ ఉండదు.. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టయిల్.. ఇక్కడ అనుకోకుండా కేసు సెన్సేషన్ అయ్యిందా, లేక అకున్ కావాలని సెన్సేషన్ కోసం తాపత్రయపడ్డాడా? ఇదీ ముఖ్యమే.. పైగా ఒక కేసు దర్యాప్తు తీరును మరో ఉన్నతాధికారి తప్పుపట్టడం అనేది ఒక అసమంజసమైన ఆనవాయితీకి దారితీసే ప్రమాదముంది.. అనవసర విభేదాలకు దారితీసే అవకాశాలూ ఉన్నాయి. వోటుకునోటు కేసు, నయీం కేసుల్లో ఆనంద్ ఈ కామెంట్లు చేయగలడా..? విశ్లేషించగలడా..? సివిల్ సప్లయిస్‌లో ఏదైనా ఇష్యూను పట్టుకుని, తనయితే ఇలా డీల్ చేసేవాడిని కాదు, ఆనంద్ డీలింగులో తప్పున్నదీ అని అకున్ సభర్వాల్ మరో ఛానెల్‌లోనే మాట్లాడితే?! తను సమర్థుడే, మంచీచెడూ విచక్షణ ఉన్నవాడే… కానీ ఒక ఇంటర్వ్యూలో ఇలా ఎందుకు అన్నాడనేది ఆసక్తికరం..

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!