ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
తెలంగాణ

గులాబీ గూటికి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌

న‌ల్గొండ జిల్లా కాంగ్రెస్ కీల‌క నేత కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కారు ఎక్క‌బోతున్నారా? ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాలు చూస్తే అదే అనిపిస్తుందని అంటున్నారు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు. త్వ‌ర‌లోనే అన్నీ కుదిరితే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గులాబీ గూటికి చేర‌వ‌చ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇన్నాళ్లు కోమ‌టిరెడ్డి బ్ర‌దర్స్ బీజేపీలో చేర‌తార‌ని పుకార్లు షికార్లు చేశాయి. అయితే ప్ర‌స్తుతం న‌ల్గొండ రాజ‌కీయాల‌ను ప‌రిశీలిస్తే కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కారెక్క‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. బీజేపీ నేత‌లతో జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదు. దీంతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గులాబీ గూటిలో చేరాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.
కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ఇటీవ‌ల కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌ను టార్గెట్ చేశారు. ముఖ్యంగా ఉత్త‌మ్ కుమార్ రెడ్డి కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌కు వ్య‌తిరేకంగా పావులు క‌దిపారు. మొన్న జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల మీటింగ్‌లో క‌నీసం వేదికపైకి కూడా పిల‌వలేదు. దీన్ని అవ‌మానంగా భావించిన కోమటిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఉత్త‌మ్‌పై మండిప‌డ్డాడు. ఆయ‌న‌కు అంత సీన్ లేద‌ని విరుచుకుప‌డ్డాడు. ఇదే టైమ్‌లో గౌర‌వ‌నీయ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటూ సంబోధించాడు. అంటే టీఆర్ఎస్ వైపు కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ చూపు ఉంద‌ని తెలుస్తోంది అంటున్నారు వాళ్ల అభిమానులు.
న‌ల్గొండ ఎంపీగా గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి రాజీనామా చేస్తే ఆ స్థానంలో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్‌లో ఎవ‌రో ఒక‌రు పోటీ చేయ‌నున్నారు. ఉప ఎన్నిక వ‌స్తే కోమ‌టిరెడ్డి త్వ‌ర‌లోనే పార్టీ మారుతార‌ని తెలుస్తోంది, లేక‌పోతే 2019 ఎన్నిక‌ల‌కు ముందు పార్టీ మారే ఆలోచ‌న‌లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఉన్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కాక రేపే అవ‌కాశాలు క‌న్పిస్తున్నాయి.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!