ఆ కోర్స్ లో ప్రేమ పాటలు నేర్పుతారు.. థియరీ క్లాస్ లే కాదు ప్రకటికల్స్ కూడా ఉంటాయి.వీరిపై వర్మ నీచమైన కామెంట్స్..., వింటే సభ్యసమాజం తలదించుకుంటుందిఈ ట్రిక్ తో జియో ఫోన్లో కూడా వాట్స‌ప్ వాడొచ్చు...........ఇవాంకా ట్రంప్‌ వస్తున్నారు ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావద్దు ప్రజలకు పోలీసుల హెచ్చరిక.ట్రంప్‌ కుమార్తె ఇవాంకాను సన్నీలియోనీతో పోల్చిన వర్మదేశ ప్రధమ పౌరుడి జీతం ఎంతో తెలుసా....ప‌రిగ‌డుపున ఏం తినాలి..ఏం తిన‌కూడ‌దో తెలుసుకోండి.........ఉత్త‌ర‌కొరియా సైనికుడి పొట్ట నిండా పురుగులు.....20 ఏళ్ల కెరిరిలో ఇంత‌వ‌ర‌కూ చూడ‌లేద‌న్న డాక్ట‌ర్లు......ఒక శవం తల ఇంకో మొండానికి అతికించిన డాక్టర్లు.........బాబు సీఎం అయితే క‌మ్మ‌ల‌కు, చిరంజీవి సీఎం అయితే కాపుల‌కు క‌డుపు నిండ‌దు........ ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ ........
తెలంగాణ

ఆ షాపులో ఏ కూర‌గాయ‌లు కొన్నా కిలో రూ.10 మాత్ర‌మే. ఎందుకో తెలుసా..?

ఆ షాపులో ఏ కూర‌గాయ‌లు కొన్నా కిలో రూ.10 మాత్ర‌మే. ఎందుకో తెలుసా..?

మార్కెట్‌లో కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఎలా ఉంటాయి..? ఎలా ఉండ‌డ‌మేమిటి, కూర‌గాయ‌ల‌ను బ‌ట్టి ధ‌ర‌లు ఉంటాయి. ఒక్కో కూర‌గాయ‌కు ఒక్కో ధ‌ర ఉంటుంది. అన్నింటికీ ఒకే ధ‌ర ఉండ‌దు. వాటి ధ‌ర‌లు ఒక‌సారి పెరుగుతాయి, ఒక‌సారి త‌గ్గుతాయి. అంతే క‌దా, అంటున్నారా..! అవును, మీరు అంటున్న‌ది క‌రెక్టే. కానీ అక్కడ మాత్రం మీరు ఏ కూర‌గాయ కొన్నా కేజీ రూ.10 మాత్ర‌మే. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంత‌కీ అదెక్క‌డో తెలుసా..?

 

అత‌ని పేరు రాజేష్‌. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా. ఆలేరు రైల్వే గేట్ ద‌గ్గ‌ర ఇత‌నికి కూర‌గాయ‌లు అమ్మే షాపు ఉంది. అయితే అందులో ఏ కూరగాయ కొన్నా కిలో రూ.10 మాత్ర‌మే తీసుకుంటాడు. ధ‌ర‌లు పెరిగినా అత‌ను కిలోకి రూ.10 మాత్ర‌మే తీసుకుంటున్నాడు. ఎందుకిలా చేస్తున్నాడంటే.. కూర‌గాయ‌ల ధ‌ర‌లు నానాటికీ పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు స‌రిగ్గా కూర‌గాయ‌ల‌ను కొని తిన‌డం మానేశారు. ఏదో ఒక వంట‌తో అడ్జ‌స్ట్ అవుతున్నారు. ఈ విష‌యం గ‌మ‌నించిన రాజేష్ త‌క్కువ ధ‌ర‌కే కూర‌గాయ‌ల‌ను అందిస్తున్నాడు.

 

 

రాజేష్ ఎప్ప‌టిక‌ప్పుడు హైద‌రాబాద్‌లోని రైతు బ‌జార్‌ల‌లో కూర‌గాయ‌ల‌ను టోకున కొని వాటిని ఆలేరుకు తీసుకెళ్లి మ‌రీ అమ్ముతాడు. ఇక రోజంతా అయిపోయాక మిగిలిన, అమ్ముడు పోని కూర‌గాయ‌ల‌ను వృద్ధాశ్ర‌మాల‌కు, అనాథాశ్ర‌మాల‌కు అంద‌జేస్తాడు. త‌న‌కు లాభాలు రాకున్నా ఫ‌ర్వాలేద‌ని, పేద‌ల‌కు స‌హాయం చేయ‌డ‌మే ముఖ్య‌మ‌ని అంటున్నాడు రాజేష్‌. అత‌ని సేవ‌కు నిజంగా అంద‌రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!