తెలంగాణ

తెలంగాణ కాంగ్రెస్ 9 మంది తో రెండో జాబితా.

Telangana Congress Announced Second List Of 8 MP Candidates
తెలంగాణ కాంగ్రెస్ 9 మంది తో రెండో జాబితా.

తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ లోకసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేయాలని భావిస్తుంది . ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది .. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి ఎన్నికల్లో నెగ్గాలని ప్రయత్నాలు చేస్తుంది . ఈ క్రమములో మొదటి జాబితాలో8 మంది అభ్యర్థుల లిస్ట్ ప్రకటించింది .కాగా వారిలో ఆదిలాబాద్ నుండి రమేష్ రాథోడ్ , మహబూబాబాద్ నుండి బలరాం నాయక్ , పెద్దపల్లి నుండి చంద్రశేఖర్ , మెదక్ నుండి గాలి అనిల్ కుమార్ , చేవెళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,మల్కాజిగిరి నుండి రేవంత్ రెడ్డి , కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ , జహీరాబాద్ మదన్ రావు పేర్లు ప్రకటించారు . ఇక తాజాగా తొమ్మిది మంది కూడిన జాబితా విడుదల చేసింది .

కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి )
మధుయాష్కీ (నిజామాబాద్),
మల్లు రవి (నాగర్ కర్నూలు),
గాయత్రి రవి (ఖమ్మం),
అంజన్‌కుమార్ యాదవ్ ( సికింద్రాబాద్),
ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్గొండ),
అబ్దుల్ సోయల్ (హైదరాబాద్),
దొమ్మాటి సాంబయ్య (వరంగల్),
వంశీచందర్ రెడ్డి (మహబూబ్‌నగర్)

To Top
error: Content is protected !!