తెలంగాణ

ఎన్నో ఆరోపణలు మరెన్నో నిందలు పడ్డ-కేసీఆర్ బయోగ్రఫీ!

telangana CM Kalvakuntla Chandra Shekhar Full Life Story
ఎన్నో ఆరోపణలు మరెన్నో నిందలు పడ్డ-కేసీఆర్ బయోగ్రఫీ!

కే సీ ఆర్ ….ఇవి కేవలం మూడు అక్షరాలా పేరు మాత్రమే కాదు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల గుండె చప్పుడు . ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపిరి . తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అన్న నినాదంతో ఉద్యమాన్ని ఉప్పెనేలా మార్చిన ధీరుడు . 13 ఏళ్లపాటు తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని భుజాల పైన ఎత్తుకుని ముందుకు నడిపించిన పోరాటయోధుడు.

ఉద్యమసమయంలో నిరాహార దీక్ష చేసి కేంద్రంలో దిగివచ్చేలా చేసిన నేత . ఒక ఏరులా మొదలైన ఉద్యమాన్ని ఒక నదిలా మార్చి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము తీసుకువచ్చిన ఉద్యమకారుడు .. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కళను నెరవేర్చిన నేత . మృత్యు ఒడికి వెళ్లి తిరిగి జీవం పోసుకున్న ఒక సాధారణ వ్యక్తి . తన వక్తా చాతుర్యంతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించే రాజకీయ నాయకుడు .

తెలంగాణ రాష్ట్ర సాధనకు అండగా నిలిచి రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించిన నేత . ఒక్కడిగా మొదలైన ఉద్యమంలో ఎన్నో ఆరోపణలు , మరెన్నో కష్టాలు , లాఠీ దెబ్బలు వీటన్నింటిని తట్టుకుని ఢిల్లీ మెడలు వంచి చివరకు రాష్ట్రం సాధించిన ధీరుడు . ఇక తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా నా తెలంగాణ కోటి ఎకరాల మగాన అన్న నినాదంతో రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు నాయకుడు . అలాంటి కేసీఆర్ జీవితంలో పడ్డ కష్టాల గురించి ఒకసారి తెలుసుకుందాం …

బాల్యం , చదువు ..

కేసీఆర్ పూర్తి పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు . తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న వ్యవసాయ కుటుంబానికి చెందిన రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతలమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది.

దీనివల్ల కేసీఆర్ చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.దింతో సిద్ధిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తి చేసాడు . తరువాత హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.ఇక 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు.

వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత . ఉన్నత చదువులు చదివి అమెరికాలు ఉద్యోగం చేశారు . ఇక్కడ తండ్రి మొదలు పెట్టిన ఉద్యమంలో పాల్గొనేందుకు వారి ఉద్యోగాలను వదిలిపెట్టి రాష్ట్ర సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు.ఉద్యమం చేసే సమయంలో ఎన్నో లాఠీ దెబ్బలు , మరెన్నో కష్టాలు పడ్డారు .

ప్రజలను ఉత్తేజపరచడంలో తమ వంతు పాత్ర పోషించారు . రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యాడు . ప్రస్తుతానికి కేటీఆర్ టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నాడు . ఇక కూతురు కవిత నిజామాబాదు పార్లమెంట్ సభ్యురాలుగా ఉంది ..

రాజకీయ ప్రవేశం …

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు.అప్పుడు జరిగే రాజకీయ పరిణామాలను తన తోటి విద్యార్థులకు చెప్పేవాడు . ఇక ఉస్మానియ యూనివర్సిటీ లో చదివే సమయంలో విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు.దింతో విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలని నిర్ణయంచుకున్నాడు .

అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ కేసీఆర్ కు రాజకీయ గురువు. డిగ్రీ పూర్తిచేసిన కేసీఆర్ 1975లో దేశంలో అత్యవసర స్థితి విధించగానే ఢిల్లీకి వెళ్ళి సంజయ్ విచార్ మంచ్‌లో చేరాడు. 1980లో సంజయ్ గాంధీ మరణించాకా సిద్ధిపేట తిరిగిచ్చాడు. 1982లో తాను ఎంతగానో అభిమానించే సినీ నటుడు నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతోనే కాంగ్రెస్‌ పార్టీ కి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు.

ఈ క్రమమంలో 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. అయిన కేసీఆర్ రాజకీయాల్లో రాణించాలన్న కోరిక మాత్రం తీరలేదు . తన ఓటమి నుండి గుణపాఠం నేర్చుకున్నాడు . గెలిస్తే ప్రపంచానికి నువ్వు పరిచయం అవుతావు అదే ఓడితే ప్రపంచం నీకు పరిచయమవుతుంది అని ఒక కవి చెప్పిన సూక్తితో రాజకీయాల్లో కి రావాలన్న సంకల్పం మరింత పెరిగింది .

ఈ నేపథ్యంలో 1985 ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున సిద్ధిపేట నియోజకవర్గం నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్తి టి మహేందర్ రెడ్డి ఫై 16521 ఓట్ల మెజారిటీ తో విజయం సాధించి మొదటి సారి అసెంబ్లీ లో అడుగుపెట్టాడు . ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం.దింతో నియోజకవర్గంలో ప్రజలందరికి అందుబాటులో ఉంటు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించడంలో సఫలీకృతం అయ్యాడు . దింతో సిద్ధిపేట ప్రజల మన్ననలు పొందాడు .

ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. 1997-98లో కేసీఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రిగా చేశాడు . 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవికి కూడా నిర్వహించాడు.

అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది. అలాగే కొన్నిసంవత్సరాల నుండి ప్రత్యేక తెలంగాణ సాధించాలన్న కేసీఆర్ కు సంకల్పం ఉన్నప్పటికీ ఏమి చేయలేని పరిస్థితి . ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రులే పాలన కొనసాగిస్తున్నారు . మొదట్లో ప్రత్యేక తెలంగాణ పేరు ఎత్తడానికి కేసీఆర్ వెనుకడుగువేశాడు ఇక ఆ తరువాత ఆంధ్ర నాయకులకు ఎదురు నిలబడి వారి పెత్తనానికి చరమగీతం పడాలని నిర్ణయించుకున్నాడు . ఆంధ్ర పాలకుల పాలన స్వస్తి పలకాలని సిద్దమయ్యాడు .

టీఆరెస్ పార్టీ స్థాపన …

అయితే తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం మాజీ నక్సలైట్లు, తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు.

ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి.

మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు.ఇక 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించాడు .

ఈ నేపథ్యంలో 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు . అయితే ఆయన పార్టీ పెట్టిన సమయంలో అనేక ఆరోపణలను ఎదుర్కున్నాడు . ప్రత్యేక రాష్ట్రం సాధించడం ని వల్ల కాదని ప్రత్యర్థులు నిందించారు . చెన్నా రెడ్డి లాంటి నాయకులూ చేయలేనిది నువ్వు చేస్తావా అంటూ కేసీఆర్ ను నిందించారు . అయినా కేసీఆర్ మాత్రం జంకలేదు .

ప్రత్యర్థులు చేసిన నిందలు ఆయనకు మరింత బలం చేకూర్చాయి . రాష్ట్రం సాధించాలన్న లక్ష్యం మరింత పెరిగింది . ఇక మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ తెరాస స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది. తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు.

తెలంగాణ ప్రజల బతుకులు మారాలంటే ప్రత్యేక తెలంగాణ సాధించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆ తరువాత తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.

టీఆరెస్ పార్టీ ఎదుర్కున్న ఎన్నికలు…..

2004 ఎన్నికల సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు . దింతో కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు అధికారం కట్ట బెట్టారు .అయితే ఈ ఎన్నికల్లో టీఆరెస్ కాంగ్రెస్ పార్టీ తో జతకట్టినా లాభంలేకుండా పోయింది . ఈ ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి కేసీఆర్ గెలుపొందాడు. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది.

ఈ సందర్భంగా తెరాస నాయకులుగా కేసీఆర్, ఆలె నరేంద్ర తో పటు కేసీఆర్ కేంద్ర మంత్రులయ్యారు. ఇక 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు.

2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000 పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు.

జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు.ఇక 2009 ఎన్నికల్లో టిడిపి తో జతకట్టారు . అయిన కానీ ఆ ఎన్నకల్లో కెసిఆర్ , చంద్రబాబుల మహాకూటమి ఓడిపోయింది . దింతో కేసీఆర్ మరింత కృంగిపోయాడు . ప్రత్యేక రాష్త్రం కోసం మళ్ళి పోరాడటానికి సిద్దమయ్యాడు . ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

ఉద్యమసమయం ….

ఇక తెలంగాణ ప్రజల కల సాకారం చేయాలనీ 2009 నవంబర్ 29 న కరీంనగర్ కేంద్రంగా ఆమరణ దీక్షకు పూనుకున్నాడు . ప్రాణం పోయినా తెలంగాణ రాష్ట్రము సాధించి తీరుతానని శపథం చేశాడు .దింతో అదే రోజు పోలీస్ లు కేసీఆర్ దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.

దింతో నిమ్స్ ఆసుపత్రిలో తన దీక్ష కొనసాగించాడు . దింతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది .జై తెలంగాణ అన్న నినాదం రాష్ట్రం అంతటా మారుమోగింది . ఇక ఉస్మానియా యూనివర్సిటీ యువకుల బలిదాలు , ధర్నాలు ,బంద్ లు మొదలయ్యాయి . గ్రామాలూ , పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు , కళాకారులూ కేసీఆర్ కు అండగా నిలిచారు .

కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ప్రజల గుండెలను తాకింది . దింతో ఉద్యోగులు , ప్రజలు సకలజనుల సమ్మె తో ఉద్యమం మరింత ఊపందుకుంది . మొత్తం నిమ్స్ ఆసుపత్రుల్లో కేసీఆర్ 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసారు .. ఈ క్రమములో సాగరహారం లాంటి ఎన్నో ఉద్యమాలు జరిగాయి . మొత్తానికి కేంద్రం దిగివచ్చి 31 జులై 2013 న ప్రత్యేక తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది .

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ….

ఇక తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 , 2014 న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసారు. దింతో నా తెలంగాణ కోటి ఎకరాల మగాన అన్న నినాదంతో కేసీఆర్ పరిపాలన కొనసాగించాడు . రైతుల కష్టాలను దూరం చేయాలనే తపనతో దేశంలో ఎక్కడలేని విదంగా ఉచితంగా 24 గంటల కరెంట్ ఇచ్చాడు . మిషన్ భగీరథ , మిషన్ కాకతీయ , అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు .

అడవులను పెంచాలనే ధ్యేయంతో హరితహారం కార్యక్రమం మొదలుపెట్టాడు .కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది . ఇక పేదల ఆకలి తీర్చేందుకు 5 రూపాయల భోజనం , ఆడబిడ్డ పెళ్లి చేసేందుకు కల్యాణలక్ష్మి , షాదిముబారక్ ద్వారా లక్ష రూపాయలు ఆర్థికసాయం అందించాడు . కేసీఆర్ కిట్ , గొల్లకురుమలకు గొర్రెలు , ముదిరాజ్ లకు చేపలు పంపిణి చేశారు .

వృద్దులకు 1000 రూపాయలు , వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్స్ ఇలా అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాడు .ఇక దేశంలో మొట్టమొదటి సారిగా రైతుల పెట్టుబడి సాయం చేసేందుకు రైతుబంధు పథకం ప్రారంభించాడు . దీని ద్వారా ఏటా ఎకరానికి 8 వేల రూపాయలు అందించాడు .దింతో కేసీఆర్ కు దేశస్థాయిలో గుర్తింపు పొందాడు . ఇలా అనేక అభివృద్ధి పనులు చేస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ దిశగా పరిపాలన చేశాడు .

ఇక దేశంలో గుణనాత్మక మార్పు రావాలని ఫెడరల్ ఫ్రంట్ కు స్వీకారం చుట్టాడు .ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నేతలతో సంప్రదింపులు చేసాడు ఇక ఆ తరువాత సెప్టెంబర్ 6 , 2017 న అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు తెర తీశాడు ..మొత్తానికి తన నాలుగున్నర ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపాడు . ఇక ముందస్తు ఎన్నికలకు వచ్చిన ఇందిరాగాంధీ లాంటి హేమాహేమీలు పరాభావం చెందినా కేసీఆర్ మాత్రం విజయం సాధించి చరిత్ర సృష్టించాడు .

దింతో తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టాడు .. ప్రస్తుతానికి కాంగ్రెస్ , బిజెపి యెతెరు ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు .. ఇక మొత్తానికి కేసీఆర్ ఎన్నో కష్టాలు మరెన్నో నిందలు ,ఆరోపణలు తట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రగతికోసం అహర్నిశలు కృషి చేస్తున్నాడు … ఏదైనా సాధించాలన్న తపన ఉండాలే కానీ సాధ్యం కానిది ఏది ఉందని అనడానికి నిలువెత్తు రూపం కేసీఆర్ . కాగా అయన రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలని , మరెన్నో పదవులు పొందాలని ఆశిద్దాం …

To Top
error: Content is protected !!