సినిమా

ఉదయ్ కిరణ్ బయోపిక్..ఎవరు చేస్తున్నారు?

Teja About To Direct Uday Kiran Bio Pic
ఉదయ్ కిరణ్ బయోపిక్..ఎవరు చేస్తున్నారు?

`నేనే రాజు నేనే మంత్రి` సినిమాతో చాలా రోజుల త‌ర్వాత హిట్ ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుడు తేజ‌కు ఒకేసారి ఇద్ద‌రు అగ్ర హీరోల‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది. విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కించేందుకు తేజ ప్ర‌యత్నాలు ప్రారంభించాడు. ఆ సినిమా ప్రారంభోత్సవం కూడా జ‌రిగిపోయింది. మ‌రికొద్ది రోజుల్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంద‌న‌గా ఆ సినిమా ఆగిపోయింది.
ఇక ఎన్టీయార్ బ‌యోపిక్ ప‌నుల‌ను కూడా నంద‌మూరి బాల‌కృష్ణ.. తేజ‌కు అప్ప‌గించిన సంగ‌తి తెలిసిందే. అంగ‌రంగ వైభవంగా ప్రారంభోత్స‌వం కూడా జ‌రిగిపోయిన తర్వాత ఆ సినిమా నుంచి తేజ త‌ప్పుకున్నాడు. కాగా, విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం తేజ ప్ర‌స్తుతం ఓ సంచ‌ల‌న బ‌యోపిక్ రూప‌క‌ల్ప‌న‌లో బిజీగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. `చిత్రం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యమై.. అన‌తికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగి.. అనంత‌రం ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని.. అర్ధాంతరంగా త‌నువు చాలించిన యంగ్ హీరో ఉద‌య్‌కిర‌ణ్ జీవిత‌క‌థ ఆధారంగా తేజ ఓ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. ప్ర‌స్తుతం ఈ సినిమా స్క్రిప్టు ప‌నుల‌తోనే తేజ బిజీగా ఉన్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ వార్త‌లో నిజ‌మెంతుందో తెలియాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు వేచి చూడాల్సిందే.

To Top
error: Content is protected !!