సినిమా

“టాక్సీవాలా” సినిమా రివ్యూ మరియు రేటింగ్!

taxiwaala movie review and rating
"టాక్సీవాలా" సినిమా రివ్యూ మరియు రేటింగ్!

టాలీవుడ్ లో గాడ్ ఫాదర్ లేని స్టార్ హీరో విజయ్ దేవరకొండ … తనదయిన ఆటిట్యూడ్ తో యువతను పిచ్చెక్కిస్తున్నాడు విజయ్ దేవరకొండ .. ఏకంగా పవన్ కళ్యాణ్ తరవాత యువతలో అంతటి క్రేజ్ విజయ్ కి మాత్రమే సొంతం అని మెగాస్టార్ చిరంజీవే సభ ముఖంగా ఒప్పుకున్నాడు.

అర్జున్ రెడ్డి – గీత గోవిందం సినిమాలతో బాక్స్ ఆఫీస్ దెగ్గర స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఫ్లాప్ ని మూటగట్టుకున్న , చేరగి జోష్ తో ఈ సారి ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ను ఎట్టి పరిస్థితులో మిస్ కావద్దని టాక్సీ వాలాతో మనముందుకు వచ్చాడు ..,

విజయ్ తన కెరియర్ మొదటి నుండి విభిన్నమైన కథలని ఎంచుకుంటూ వస్తూండటంతో ఈ సినిమాపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి . అయితే రిలీజ్ కు ముందు పైరసీ ప్రింట్ వచ్చేయటం సినిమాకు ఊహించని దెబ్బే. అయితే ఆయనకు అభిమానులు అండగా ఉంటామని మాట ఇచ్చారు. ఈ నేఫధ్యంలో ఈ రోజు విడుదలైన టాక్సీవాలా సినిమా ప్రపంచవ్యాప్త టాక్ ఎలావుందో ,మనం ఈ రివ్యూలో చూసేద్దామా.

కథ కథనం విశ్లేషణ ..!

హారర్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో మలిచిన కథే టాక్సీ వాలా ..విజయ్ ఇంతవరకు టచ్ చేయని జానర్ ఇది ..సాధ్యమైనంతవరకు ఒక్కసారి చేసిన కథను టచ్ చేయని హీరోలు ఇండియాలో కేవలం కమల్ హాసన్ ఆమిర్ ఖాన్ లు మాత్రమే . ఈ ఇద్దరి దిగ్గజాల తరవాత విజయ్ దేవరకొండ ఈ కోవలోకి వస్తాడని చెప్పొచ్చు ..సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ హిట్టు ఫ్లాప్ లకు జంకకుండా దూసుకుపోతున్న విజయ్ టాక్సీ వాలా వంటి డిఫరెంట్ కథను ఎంచుకోవడం జరిగింది ..

జాబ్ ట్రైల్స్ లో ఉన్న విజయ్..ముందు ఏదో రకంగా రూపాయి సంపాదించాలని ఫిక్స్ అవుతాడు. అన్నావదినల సాయింతో పాతకాలం కారును కొనుగోలు చేసి క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. ఒక అమ్మాయి ప్రేమలో పడ్డ శివ ఆ తరువాత క్యాబ్ వల్ల ఊహించని సమస్యలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత మెల్లిగా ఆ క్యాబ్ లో ఎదో తెలియని దెయ్యం ఉందని అర్దం చేసుకుంటాడు. ఆ విషయం ఫ్రెండ్స్ కు చెప్పినా ఎవరూ నమ్మరు. పోనీ క్యాబ్ ని వదిలేద్దామంటే అది..విజయ్ ని వదలదు.

సర్లే అనుకుంటే ఈ లోగా ఓ రోజు ..ఆ క్యాబ్ ఓ వ్యక్తిని చంపేస్తుంది. దాంతో విజయ్ కు భయం పట్టుకుంటుంది. అక్కడ నుంచి కారుతో ఇంటరాక్ట్ అవటం మొదలెడతాడు. అక్కడ నుంచి ఏమి జరిగింది..అసలు క్యాబ్ ని పట్టిన దెయ్యం ప్లాష్ బ్యాక్ ఏమిటనేది టాక్సీవాలలో ముఖ్య కథాంశం .. పేరుకి హారర్ ఐన కూడా ఆధ్యంతం నవ్వులు పూయించే సీన్లతో పక్క ఎంటర్టైనింగ్ స్క్రీన్ ప్లే తో దర్శకుడు ఈసినిమాను మలిచిన తీరు గొప్పది అని చెప్పొచ్చు ..

ఇనోవేటివ్ ఐడియాతో వచ్చే దర్శకులకి విజయ్ వంటి వెర్సటైల్ ఆర్టిస్ట్ దొరకడం , ఆ సదురు దర్శకుడి అదృష్టమని కొరటాల శివ లాంటి డైరెక్టర్ చూపిన మాటలు ఈసినిమా చూస్తే మనకు రైట్ అనిపిస్తుంది .. తన మాస్ ఇమేజిని పక్కన పెట్టి , టాక్సీవాలాలో భయపడే పాత్రలో విజయ్ చించేసాడని చెప్పొచ్చు .. సరికొత్త హావభావాలతో ప్రేక్షకులని నవ్విస్తూ , భయపెడుతూ , చివరికి కన్నీళ్లు కూడా తెప్పిస్తాడు విజయ్ .. ఇక హీరోయిన్ ప్రియాంక జవల్కర్ తో కార్ లో వచ్చే రొమాంటిక్ సీన్స్ కూడా సినిమాలో ఎంతో పండాయి ..

బక్కచిక్కిన హీరోయిన్స్ దేహాలు చూసి బోర్ కొట్టిన తెలుగు ప్రేక్షకు;లకి ప్రియాంక జవల్కర్ కచ్చితంగా నచ్చుతుంది ..సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్క్ అవుట్ అయిందని చెప్పొచ్చు .. సినిమా మొదటి భాగం పొట్టచెక్కలయ్యే కామెడీతో ఎక్కడ బోర్ కొట్టకుండా సాగిపోతుంది .. ఇక సెకండ్ హాఫ్ లోనే అసలు కథ మొదలవుతుంది .. నూతన దర్శకుడు కావడం వళ్ల రాహుల్ అసలు కథను చెప్పడంలో కొంచం తడబడిన చక్కటి క్లైమాక్స్ , ప్రీక్లైమాక్స్ ఎపిసోడ్స్ తో , టాక్సీ వాలని హిట్ సినిమాగా ముగించాడు .. ఇక చివరిగా నిన్న రిలీజ్ ఐన రవితేజ సినిమకి డిజాస్టర్ టాక్ రావడం టాక్సీ వాలా కు కలిసొచ్చే అంశం..

ముఖ్యంగా టాక్సీవాలా కొత్తదనంతో కూడిన కథ కావడం , పేసి స్క్రీన్ ప్లే ఉండటం , ఆద్యాంతంసాగే నవ్వులు , హీరోయిన్ అందచందాలు , హీరో ఫ్రెండ్స్ కామెడీ , అన్నింటికిమించిన విజయ్ పెర్ఫార్మెన్స్ , నటనతో ఈ సినిమా నోటా కంటే 100రేట్లు బెటర్ అనే టాక్ ని సంపాదించుని , బాక్స్ ఆఫీసుదెగ్గర విజయవంతంగా దూసుకుపోవడం పక్క అని చెప్పొచ్చు .. ఇక ఈటాక్సి వాలా కి మా యోయో టివి ఇస్తున్న రేటింగ్ 3.75 అవుట్ ఆఫ్ 5

To Top
error: Content is protected !!