ఆంధ్ర ప్రదేశ్

బాలయ్యపై పోటీచేయనున్న యాంకర్ శ్వేతారెడ్డి!

Swetha Reddy To Contest Against Balakrishna From Hindupur
బాలయ్యపై పోటీచేయనున్న యాంకర్ శ్వేతారెడ్డి!

హిందూపురంలో హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ మీద జర్నలిస్ట్, యాంకర్ “శ్వేతారెడ్డి” పోటీ చేయనున్నారు. హిందూపూర్ నుండి శ్వేతారెడ్డి,
అమలాపురం నుండి “లక్ష్మి తులసి ” ప్రజాశాంతి పార్టీ తరపున పోటీచేయనున్నట్లు KA పాల్ స్వయంగా వెల్లడించారు.

శ్వేతారెడ్డి చాలా ఛానెల్ లలో పనిచేస్తున్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో కూడా పనిచేస్తున్నారు.పార్టీ తరపున పోటీచేయాలనుకున్న వారు కలవమని, పాల్ అనడంతో అభ్యర్థులు కలిశారు. అయితే పాల్ మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ ఎదో ఒక్క కులానికి చెందినది కాదన్నారు.

పార్టీలో అన్ని కులాల వారు ఉన్నారన్నారు. తనను కలిసిన వారిలో చౌదరి, కాపు, రెడ్డి, వెలమ, గౌడ్స్ , క్రిస్టియన్స్ అందరూ ఉన్నారన్నారు. ప్రజాశాంతి పార్టీ కేవలం క్రిస్టియన్స్ కు చెందింది కాదన్నారు. తాను కుల గజ్జిని తొలగించడానికి కాపు అయినప్పటికీ , దళిత అమ్మాయిని వివాహం చేసుకున్నానన్నారు.

10000 వేల మందిని పిలిచి సభ పెడితే, స్వయంగా వచ్చి అభ్యర్థిని నియోజకవర్గం లో ప్రకటిస్తామన్నారు. శ్వేతారెడ్డి మాట్లాడుతూ ప్రజాశాంతి పార్టీ మళ్ళీ వచ్చినప్పుడు, కేవలం రిలీజియన్ పార్టీ అని, ఫండింగ్ కోసం మాత్రమే వచ్చిందని అనుకున్నామని తెలిపారు.

కానీ పార్టీలో అలా లేదని అన్నారు. అయితే శ్వేతారెడ్డి కి మద్దెలచెరువు సూరి కి సంభందాలు ఉన్నట్లు, గతంలో వార్తలు హల్చల్ అయిన సంగతి తెలిసిందే..

To Top
error: Content is protected !!