క్రీడలు

సురేష్ రైనా కుమార్తె బర్త్ డే వేడుకలో ధోనీ సందడి..

Suresh Raina Daughter GRACIA 2nd Birthday Celebration
సురేష్ రైనా కుమార్తె బర్త్ డే వేడుకలో ధోనీ సందడి..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న సురేష్ రైనా కుమార్తె గ్రేసియా బర్త్ డే వేడుకను ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని, బ్రావో సీఎస్‌కే క్రీడాకారులు పాల్గొని సందడి చేశారు. చెన్నై జట్టు ఈ నెల 18న ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఇందులో భాగంగా ప్లేయర్స్‌ ఢిల్లీ చేరుకున్నారు.

ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ప్లే ఆఫ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. భజ్జీ తన భార్య గీతా బస్రా కుమార్తె హినయాతో కలిసి వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తన కుమార్తె యాక్టింగ్‌లో అదరగొట్టేస్తుందని.. అప్పుడే 20 ఏళ్ల యువతి తరహాలో యాక్ట్ చేస్తుందంటూ కామెంట్ చేశాడు.

To Top
error: Content is protected !!