నేషనల్

మమతకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు!

supreme court shock to west bengal cm Mamata Banerjee
మమతకు షాక్ ఇచ్చిన సుప్రీం కోర్టు!

కోల్కతా సంఘటనపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరుతూ, సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించి రెండు పిటిషన్లు వేసింది. సిబిఐ కోరిన పిటిషన్ల సమాచారం ఏంటంటే, తక్షణమే పోలీసు కమిషనర్ లొంగిపోవాలి. ఆధారాలు ధ్వంసం చేయకూడదు, దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించగా దానికి సహకరించకుండా పోలీసు కమిషనర్ కోర్టు ధిక్కరణకు పాల్పడుతున్నారు.ఈ విషయమై ఆయనపై చర్యలు తీసుకోవాలి అని సిబిఐ దాఖలు చేసింది.

ఆధారాలు ధ్వంసం చేశారనడానికి సాక్ష్యాలు ఉంటే ప్రమాణ పత్రం రూపంలో సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ‘‘గందరగోళం నెలకొన్న సమయంలో పశ్చిమ బెంగాల్ అధికారులుగానీ, పోలీసులుగానీ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు ధ్వసం చేయాలన్న ప్రణాళిక వేశారనడానికిగానీ, నాశనం చేయాలని ప్రయత్నించారనడానికిగానీ సాక్ష్యాలు ఉంటే సొలిసిటర్ జనరల్గానీ, ఇతరులుగానీ సమర్పించవచ్చు’’ అని పేర్కొంది.

ఇక ఈ కేసులో విచారించిన సుప్రీమ్ కోర్టు , పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీకి, గట్టి షాక్ ఇచ్చింది. సీబీఐ ఎదుట కోల్ కతా పోలీస్ కమిషనర్ విచారణకు హాజరు కావాల్సిందేనని, సుప్రీం కోర్టు ఆదేశించింది. శారదా, రోజ్ వ్యాలీ చిట్ ఫండ్ కుంభకోణాలకు సంబంధించిన కేసులలో ఆధారాలను మాయం చేశారని, కమిషనర్ రాజీవ్ కుమార్ పై, ఆరోపణలున్నాయి. దానికి సంబంధించి, సీబీఐ అధికారులు కోల్ కతాకు వస్తే వారిని విచారించకుండా బెంగాల్ పోలీసులు అడ్డుకున్నారు.

వారకి బాసటగా సీఎం మమతా బెనర్జీ నిలిచి దీక్ష చేస్తున్నారు. దీంతో సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు విచారణకు రాజీవ్ కుమార్ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది.కోల్ కతా కమిషనర్ రాజీవ్ ను విచారించే అధికారం సీబీఐకి ఉందని, దానికి కమీషనర్ సహకరించాలని సూచించింది. ఢిల్లీ, కోల్ కతాలో కాకుండా తటస్థ వేదికలో విచారణ జరపాలని సీబీఐని ఆదేశించింది.

ఈ కేసు పరిణామాల నివేదికలను సీల్డ్ కవర్ లో ధర్మాసనానికి అందజేయాలని తదుపరి విచారణను ఫిబ్రవరి 20 కి కోర్టు వాయిదా వేసింది.కేంద్ర ప్రభుత్వానికి, సీబీఐకి వ్యతిరేకంగా మమతా బెనర్జీ ధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు దేశవ్యాప్తంగా ఉన్న విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. పార్లమెంటు ఉభయసభల్లో ఈ వివాదం దుమ్మురేపింది. నియంతల నుంచి దేశాన్ని, రాజ్యాంగాన్ని రక్షించేందుకే తాను ధర్నా చేపట్టానని మమత ప్రకటించారు.

To Top
error: Content is protected !!