సినిమా

సుమంత్ ‘ఇదం జగత్’ రివ్యూ మరియు రేటింగ్!

సుమంత్, అంజు కురియన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం “ఇదం జగత్”. విరాట్ ఫిలిమ్స్ మరియు శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై నిర్మాతలు జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ శ్రీ కంఠం దర్శకత్వం వహించారు.

శివాజీ రాజా, సత్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది .. ఎన్ని అపజయాలు ఎదురైనా కథలో కంటెంట్ ఉంటేనే సినిమాను చేస్తాడు అన్న పేరే హీరో సుమంత్ పై ప్రేక్షకులకి నమ్మకాన్ని ఇస్తుంది .

ఇదం జగత్ కూడా అలాంటి సినిమా అన్న టాక్ ఇప్పటికే వచ్చేసిన అది కాసుల వేటలో ఏ మాత్రం సక్సెస్ అయిందో ఈ రివ్యూలో చూసేద్దాం ..,

కథ కథనం విశ్లేషణ ..!

హీరో సుమంత్ విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే, ఈ సినిమా కథ కూడా అతని అభిరుచికి దగ్గట్లే పూర్తి వైవిధ్య భరితంగా, కొత్తగా ఉంటుందని ట్రైలర్ ను బట్టి చూస్తే మనకర్దమవుతుంది .. ఇందులో స్వార్ధం ఉన్న క్రైమ్ రిపోర్టర్ పాత్రలో కనిపించాడు సుమంత్.

ఇందులో సుమంత్ నైట్ టైంలో క్రైమ్ న్యూస్ ని కవర్ చేసి, దాన్ని బిజినెస్ చేస్తుంటాడట, ఇలా చేయడం ద్వారా అతనికి ఎదురైనా సమస్యలేంటి? ఆ సమస్యల నుండి హీరో ఎలా బయట పడతాడు అన్నదే ఈచిత్రం మూల కథాంశం ..

సమాజానికి ఫోర్త్ ఎస్టేట్ గా వ్యవహరించాల్సిన మీడియాలోని జర్నలిస్టులు కూడా వార్తలని రేటింగ్స్ కోసం ఎలా బిజినెస్ చేస్తున్నారు అన్న మంచి మెసేజితో కూడుకున్న పాయింటుని తెరపై ఎంతో థ్రిల్లింగ్ గా చూపించాడు దర్శకుడు అనిల్ శ్రీకాంతం ..

పెరుగుతున్న పోటీ తో పోటీ పడలేక న్యూ ఛానెల్స్ , వాటి యాజమాన్యమ్ ఎలాంటి ఘోరాలు చేస్తున్నారో ఈసినిమాలో కళ్ళకు కట్టినట్టు చుపించారు ..ఈ సినిమాలోని క్రైం , థ్రిల్ , సస్పెన్స్ వంటివి మనల్ని ఎంతో ఎంగేజ్ చేస్తాయి ..

జర్నలిజం లో స్వార్థపరులు ఉంటే , వాడికి డబ్బు పిచ్చి ఉంటే సమాజంపై ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అది ఇంతకు దారితీస్తుంది అన్న కాన్ టెంపరరీ విషయాన్నీ చక్కటి స్క్రీన్ ప్లే తో తెరకెక్కించాడు దర్శకుడు ..

ఇక హీరో సుమంత్ ఈ పాత్రకు చక్కగా సూట్ అయ్యాడు .. స్టార్ హీరోల మాదిరి ఆర్టిఫీషియల్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా సహజంగా , నాచురల్ గా , అండర్ కరెంట్ పాత్రలు చేయడంలో సిద్ధహస్తుడైన సుమంత్ ఈ పాత్రను ఎంతో అవలీలగా చేసేసాడు.., అయితే సుమంత్ యాక్టింగ్ తో పాటు ఆయన చెప్పే డైలాగ్స్ కూడా ఈసినిమాలో ఎంతో పేలాయి అని చెప్పొచ్చు ..,

జర్నలిస్టుగా మనకి కావలిసింది గొడవ జరగడం, మరీ ఇంత డైంజర్ గా ఉన్నవేంట్రా?, కూలిన చెట్టు…కాలిపోతున్న కారే మనకు న్యూస్, క్రైమ్, ఆక్సిడెంట్, మర్డర్ వంటివి మాత్రమే నాకు న్యూస్ .. సుమంత్ చెప్పే డైలాగ్స్ అన్నీకూడా అందరిని ఆకట్టుకున్నాయి.

ఇక చివరిగా మల్లి రావుతో చాల కాలం తరవాత ఫార్మ్ లోకి వచ్చిన సుమంత్ ఈసినిమాతో కూడా అది నిలబెట్టుకున్నాడు .. పెద్ద సినిమాలేవీ విడుదలవ్వకపోవడం ఈ చిన్న సినిమాకు ఎంతో కలిసొచ్చే అంశం …ఇక ఈ సినిమాకు మా యోయో టివి ఇస్తున్న రేటింగ్ 3 అవుట్ ఆఫ్ 5

To Top
error: Content is protected !!