నేషనల్

పాక్ విమానాన్ని కూల్చేశారన్న వార్తలపై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

Stock Market Updates Today 27 february 2019
పాక్ విమానాన్ని కూల్చేశారన్న వార్తలపై నష్టాల్లోకి స్టాక్ మార్కెట్లు

భారత్-పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో దాని ప్రభావం స్టాక్ మార్కెట్ల పై పడింది. ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 260 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అయింది.

అయితే పాక్ కు చెందిన యుద్ధ విమానాన్ని భారత్ కూల్చి వేసిందన్న వార్తలతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 189 పాయింట్ల నష్టంతో సాగింది. ఆ తర్వాత కొంచెం కోలుకున్నప్పటికీ… చివరి గంటలో మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 35,905కి జారిపోయింది. నిఫ్టీ 28 పాయింట్లు కోల్పోయి 10,806 వద్ద ఆగింది.

యస్ బ్యాంక్, భారతి ఇన్ఫ్రాటెల్, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా మోటార్స్, వేదాంత తదితర కంపెనీలు నష్టాలను దారిన పడ్డాయి. ఆల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, ఎల్ అండ్ టీ, సన్ ఫార్మా, భారతి ఎయిర్ టెల్ తదితర కంపెనీలు లాభాలతో ముగిశాయి.

To Top
error: Content is protected !!