సినిమా

శ్రీదేవి గురించి సంచలన విషయాలు చెప్పిన సోనమ్ కపూర్

sridevi used to help in makeup and acting said sonam kapoor
శ్రీదేవి గురించి సంచలన విషయాలు చెప్పిన సోనమ్ కపూర్

తాను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో తన పిన్ని శ్రీదేవి తనకు ఎంతో సాయపడ్డారని అంటున్నారు బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌. అందుకే ఇప్పుడు తాను చెల్లెలు జాన్వికి సాయపడాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. సోనమ్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో శ్రీదేవితో తనకున్న అనుబంధం గురించి పంచుకున్నారిలా.

‘నేను చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పుడు పిన్నినాకెంతో సాయపడ్డారు. మేకప్‌ దగ్గర్నుంచి నటన వరకు అన్ని విషయాలు చెప్పేవారు. వీలు కుదిరినప్పుడల్లా పిన్నిఇంటికి వెళ్లేదాన్ని. ఆమెతో అన్ని విషయాలు పంచుకునేదాన్ని. ఇప్పుడు నాకంటూ ఇండస్ట్రీలో ఓ గుర్తింపు ఉంది. ఇక పిన్ని కూతురు జాన్వి సినిమాల్లోకి వచ్చింది. ఇప్పటికే నేను జాన్వికి ఎంతో కౌన్సిలింగ్‌ ఇచ్చాను. తొలి సినిమాతోనే తను ఓ ప్రొఫెషనల్‌గా వ్యవహరించింది. తనకు నేను ఇచ్చిన సలహా ఒక్కటే. భుజం తట్టి ప్రోత్సహించేవారి కంటే విమర్శించేవారే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎవరెన్ని చెప్పినా తలదించుకుని మన పని మనం చేసుకుంటూ పోవాలి అని చెప్పాను. జాన్వి ఇప్పుడు అదే పాటిస్తోంది.’ అని పేర్కొన్నారు సోనమ్‌.

సోనమ్‌, కరీనా కపూర్‌, స్వరాభాస్కర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘వీరే ది వెడ్డింగ్‌’ సినిమా జూన్‌1న విడుదల కాబోతోంది. ఈ సినిమాతో పాటు ఆమె తన తండ్రి అనిల్‌ కపూర్‌తో కలిసి ‘ఎక్‌ లడికీ కో దేఖాతో ఐసా లగా’, దుల్కర్‌ సల్మాన్‌తో ‘ది జోయా ఫ్యాక్టర్’ చిత్రాల్లో నటించనున్నారు.‌

To Top
error: Content is protected !!