క్రీడలు

ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ జెర్సీ మార్చి పింక్ జెర్సీ ఎందుకు?

ఈ మ్యాచ్‌లో ఆకుపచ్చ జెర్సీ మార్చి పింక్ జెర్సీ ఎందుకు?

ఏంటీ మొన్నటిదాకా ఆకుపచ్చ రంగు జెర్సీలు వేసుకున్న సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ రోజు పింక్ జెర్సీ వేసుకున్నారే అని చూస్తున్నారా.. దానికీ ఒక కారణముంది.

రొమ్ము కేన్సర్‌పై అవగాహన పెంచేందుకు వారు ఇలా చేశారు.

రొమ్ములకు సంబంధించి అసాధారణ మార్పులు కనిపిస్తే మహిళలు వైద్యులను సంప్రదించాలి.

గణాంకాలు ఏం చెబుతున్నాయి

  • భారత్‌లో రొమ్ము కేన్సర్ బారిన పడే మహిళల శాతం ఎక్కువ.
  • లక్ష మంది మహిళల్లో 33 మంది బ్రెస్ట్ కేన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ అంచనా.
  • దేశంలో ఏటా లక్ష మందికిపైగా రొమ్ము కేన్సర్ బారినపడుతున్నారు.
  • 2020కి దేశంలో రొమ్ము కేన్సర్ బాధితుల సంఖ్య 1797900 కి చేరవచ్చని జాతీయ బయో టెక్నాలజీ సమాచార కేంద్రం అంచనా.
  • జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, అవగాహనా లోపాలను రొమ్ము కేన్సర్ కి కారణాలని తెలిపింది.
To Top
error: Content is protected !!