క్రీడలు

ఇండొనేసియా మాస్టర్స్‌ ఫైనల్స్‌కు-సైనా!

ఇండొనేసియా మాస్టర్స్‌ ఫైనల్స్‌కు-సైనా!

ఇండోనేషియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో పివి సింధుపై రెండు వరుస గేముల్లో విజయం సాధించి సెమీస్‌కు చేరిన సైనా అదే జోరును కొనసాగించింది. థా§్‌ులాండ్‌ క్రీడాకారిణి, నాలుగో సీడ్‌ రచనోక్‌తో సెమీస్‌లో తలపడిన సైనా రెండు వరుస సెట్లలో విజయం సాధించింది.

49 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన ఈ పోరు ఆద్యంతం నువ్వానేనా అన్నట్లు సాగింది. గాయం నుంచి కోలుకోని ఇటీవలే కోర్టులో అడుగుపెట్టిన సైనా ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. చివరకు సైనా 21-19తో మ్యాచ్‌ను గెలుచుకుని ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో ఏడాది పాల్గొన్న తొలి టోర్నమెంట్‌లోనే సైనా ఫైనల్‌ చేరడంతో భారత అభిమానుల్లో సంతోషం వ్యక్తమైంది. తైజు యింగ్‌-బింగ్‌ జియావో మధ్య జరిగే రెండవ సెమీఫైనల్‌ విజేతతో సైనా ఆదివారం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

To Top
error: Content is protected !!