క్రీడలు

హోరా హోరి గా పోటీ పడి రన్నర్ గా నిలిచింది-సింధు!

హోరా హోరి గా పోటీ పడి రన్నర్ గా నిలిచింది-సింధు!

బ్యాడ్మింటన్‌ అగ్రశ్రేణి క్రీడాకారిణి పి.వి సింధు మరోసారి తుది అడుగు తడబడింది. ఇండియా ఓపెన్‌ ఫైనల్లో గెలుపు ఖాయమనుకున్న మ్యాచ్‌లోనూ సింధు టైటిల్‌ సాధించలేదు. వరల్డ్‌ నెం.11, అమెరికా అమ్మాయి బీవెన్‌ జాంగ్‌ చేతిలో మూడు గేముల మ్యాచ్‌లో సింధు పరాజయం పాలైంది. రన్నరప్‌గా నిలిచి టైటిల్‌ నిలుపుకోలేకపోయింది. 21-18, 11-21, 20-22తో సింధు ఓటమి పాలైంది. 70 నిమిషాల టైటిల్‌ పోరులో సింధు పైచేయి సాధించలేదు. తొలి గేమ్‌లో నెగ్గినా.. సింధు వరుసగా తర్వాతి రెండు గేముల్లో తడబడింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ టైబ్రేకర్‌కు దారితీయగా అమెరికా అమ్మాయి ముందంజ వేసింది. ఇండియా ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ ఎగరేసుకుపోయింది.

తొలి గేమ్‌లో 3-0తో ముందంజలో నిలిచిన సింధు విరామ సమయానికి 10-11తో వెనక్కి తగ్గింది. కానీ ద్వితీయార్థంలో పుంజుకున్న సింధు 15-15తో స్కోరు సమం చేసి 17-16, 19-18తో ముందం వేసింది. ఆఖర్లో రెండు వరుస పాయింట్లతో తొలి గేమ్‌ దక్కించుకున్నది. కానీ రెండో గేమ్‌లో సింధు పూర్తిగా నిరాశపరిచింది.

2-8తో వెనకడుగు వేసిన సింధు 6-11, 19-9తో నిరాశపరిచింది. దీంతో ఫలితం కోసం మూడో గేమ్‌ ఆడక తప్పలేదు. నిర్ణయాత్మక గేమ్‌లో 4-4తో సమవుజ్జీగా నిలిచినా.. వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయి వెనుకంజ వేసింది.

కానీ ద్వితీయార్థంలో హోరాహోరీగా ఆడిన జాంగ్‌, సింధులు 11-11 నుంచి 15-15 వరకూ నువ్వా నేనా అన్నట్టు ఆడారు. ఆఖర్లో మెరిసిన సింధు 19-18తో ఆధిక్యం సాధించినా.. జాంగ్‌ సింధును నిలువరించి టైబ్రేకర్‌లో ఇండియా ఓపెన్‌ను సొంతం చేసుకున్నది.

To Top
error: Content is protected !!