క్రీడలు

ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిదే హవా!

ఐపీఎల్ వేలంలో ఆ ఇద్దరిదే హవా!

బెంగళూరులో నిర్వహించిన ఐపీఎల్ వేలంపాట ఆసక్తికరంగా సాగిన సంగతి తెలిసిందే.గేల్ వంటి బ్యాట్స్ మన్ ను మొదటి రోజు ఎవరూ కొనకపోవడం….రెండో రోజు చివరకు 2 కోట్ల తక్కువ ధరకు పంజాబ్ దక్కించుకోవడం….ఉనాద్కత్ – కె. గౌతమ్ అనూహ్యంగా భారీ ధర పలకడం…..ఇషాంత్ శర్మ – ప్రగ్యాన్ ఓజా – లసిత్ మలింగ వంటి క్రికెటర్లను ఎవరూ తీసుకోకపోవడం…..ఈ వేలంపాటలో హైలైట్స్ అని చెప్పవచ్చు. అయితే ఈ వేలం పాటలో ఆటగాళ్లతో పాటు మరో ఇద్దరు యంగ్ స్టర్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ముంబై ఇండియన్స్ యజమాని ముఖేశ్ అంబానీ తనయుడు ఆకాశ్ – కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని జూహీ చావ్లా కూతురు జాన్వీ ఈ వేలంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఆటగాళ్ల బెట్టింగ్ లో – పెడెల్ ను రైజ్ చేయడంలో వీరిద్దరూ ముందుండడం విశేషం. జుహీ చావ్లా – నిర్మాత జయ్ మెహతాల కూతురు అయిన జాన్వీ వేలంలో పాల్గొన్న అతి పిన్న వయస్కురాలిగా పేరు తెచ్చుకుంది. వేలం పాటలో యాక్టివ్ గా ఉండడంతో జాన్వీ పై అందరూ ఎక్కువగా ఫోకస్ చేశారు. ఓ దశలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు సహ యజమానురాలు – బాలీవుడ్ నటి ప్రీతిజింటాతో పాటు జాన్వీ కూడా ఈ వేలంలో ఆటగాళ్ల కోసం విపరీతంగా పోటీ పడింది. వేలంలో మిగతా ఫ్రాంఛైజీలతో పోటీ పడుతున్న ఈ చిన్నది ఎవరంటూ అందరూ ఆరా తీశారు. కేకేఆర్ మ్యాచ్ లకు జూహిచావ్లా తప్పక హాజరై సందడి చేస్తుంది. మరి ఈ ఐపీఎల్ లో తల్లితో కలిసి జాన్వి కూడా మ్యాచ్ లకు వస్తుందో…..లేక కేవలం బెట్టింగ్ కే పరిమితమవుతుందో వేచి చూడాలి.

To Top
error: Content is protected !!