క్రీడలు

నాలుగోసారి ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు..

నాలుగోసారి ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు..

అండర్‌ 19 వరల్డ్‌ కప్‌లో భాగంగా శనివారం ఆసీస్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత జట్టు ఇరగదీసింది. ఆసీస్‌కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి వరల్‌కప్‌ను కైవసం చేసుకుంది. ఫలితంగా నాల్గోసారి వరల్‌ కప్‌ను ఖాతాలో వేసుకుని అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు భారత జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఆసీస్‌ విసిరిన 217 పరుగుల లక్ష్యాన్ని 38.5 ఓవర్లలో ఛేదించి సగర్వంగా కప్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా ప్రపంచ వినువీధుల్లో జాతీయ జెండాను ఎగురవేసి భారత కీర్తిని మరింత పెంచింది.

లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టుకు ఓపెనర్లు పృథ్వీషా, మన్‌జోత్‌ కర్లాలు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 11.4 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యం సాధించి పటిష్ట స్థితికి చేర్చారు. పృథ్వీ షా(21) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరినప్పటికీ మిగతా పనిని మన్‌జోత్‌ కల్రా(101 నాటౌట్‌;102 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్విక్‌ దేశాయ్‌(47 నాటౌట్‌; 61 బంతుల్లో 5 ఫోర్లు)లు పూర్తి చేశారు. శుభ్‌మాన్‌ గిల్‌(31) ఆకట్టుకున్నాడు.

అంతకుముందు టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులుకు ఆసీస్‌ ఆలౌట్‌ అయ్యింది. ఆసీస్‌ ఆటగాళ్లలో జోనాథన్‌ మెర్లో(76;102 బంతుల్లో 6 ఫోర్లు) మినహా ఎవరూ హాఫ్‌ సెంచరీ మార్కును చేరలేదు. పరమ్‌ ఉప్పల్‌(34),జాక్‌ ఎడ్వర్డ్స్‌(28), నాథన్‌ మెక్‌ స్వీనీ(23)లు మోస‍్తరుగా రాణించారు. భారత బౌలర్లలో పొరెల్‌, శివ సింగ్‌, నగర్‌ కోటి, అనుకూల్‌ రాయ్‌ తలా రెండు వికెట్లు తీయగా.. శివమ్‌ మావి ఓ వికెట్‌ తీశాడు.
ఈసారి ఫైనల్‌ ఒత్తిడిని అధిగమించి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఫలితంగా టోర్నీలో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అద్భుతమైన గిఫ్ట్‌ను అందించింది.

To Top
error: Content is protected !!