క్రీడలు

పాండ్యతో డేటింగ్‌పై నటి స్పందన!

పాండ్యతో డేటింగ్‌పై నటి స్పందన!

ప్రముఖ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్య..బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు వెలువుడుతున్నాయి. హార్దిక్‌ సోదరుడు కృనాల్‌ పాండ్య వివాహ వేడుకకు ఎల్లీ హాజరైంది. అప్పుడు ఎల్లీ..హార్దిక్‌ పక్కనే నిలబడి ఫొటో దిగడంతో వదంతులకు మరింత ఊతమిచ్చినట్లైంది. ఈ విషయం గురించి తాజాగా ఎల్లీ స్పందించింది.ఈ విషయం గురించి ఇప్పుడు తానేం చెప్పినా ఎవ్వరూ నమ్మరని అంటోంది. ‘ప్రజలు నా గురించి ఏమన్నా అనుకోనివ్వండి. ప్రతీ విషయంలో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. హార్దిక్‌తో డేటింగ్‌లో ఉన్నానంటూ వస్తున్న వదంతులపై స్పందిస్తే నాకు నేనే మరిన్ని పుకార్లు సృష్టించుకున్నట్లు అవుతుంది. ఇప్పటివరకు నా గురించి ఎన్నో తప్పుడు వార్తలు రాశారు. వాటి గురించి కూడా నేనెప్పుడూ స్పందించలేదు. సెలబ్రిటీలంటే అంతే. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతుంటారు. అలా అని మేము మా పనులను మానుకోలేం.’ అని చెప్పుకొచ్చింది ఎల్లీ.

గతంలో హార్దిక్‌..బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రాతో డేటింగ్‌లో ఉన్నాడని కూడా వార్తలు వెలువడ్డాయి. పరిణీతి ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన ఓ ఫొటోపై హార్దిక్‌ కామెంట్‌ చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వదంతులు వినిపించాయి. ఆ తరువాత అలాంటిదేమీ లేదని హార్దిక్‌ క్లారిటీ ఇచ్చాడు.

To Top
error: Content is protected !!