క్రీడలు

మామ గారి దగ్గర నుండి గిఫ్ట్ తీసుకున్న విరాట్ …!

anushka father special gift to virat kohli
మామ గారి దగ్గర నుండి గిఫ్ట్ తీసుకున్న విరాట్ ...!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ వివాహమై రెండు నెలలు కావొస్తోంది. వృత్తిపరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా.. సామాజిక మాధ్యమాల్లో ఒకరినొకరు ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అనుష్క.. విరాట్‌ను మెచ్చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. మరోపక్క అనుష్క నటించిన ‘పరి’ టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్‌ తనకూ నచ్చిదంటూ కోహ్లీ ట్విటర్‌లో పేర్కొన్నాడు.ఇప్పుడు అనుష్క తండ్రి అజయ్‌ కుమార్‌.. తన అల్లుడికి ఓ కానుక ఇచ్చారు. విరాట్‌కి కవితలంటే చాలా ఇష్టం. అందుకని.. ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్‌ రచించిన ‘స్మోక్స్‌ అండ్‌ విస్కీ’ అనే పుస్తకాన్ని అజయ్‌ విరాట్‌కి కానుకగా ఇచ్చారు. గురువారం ముంబయిలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తకం ఓ కాపీని అజయ్‌.. విరాట్‌కు పంపించారు. మ్యాచ్‌ల నిమిత్తం విరాట్‌ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్నాడు. మరోపక్క అనుష్క ‘జీరో’, ‘పరి’, ‘సూయీధాగా’ సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉంది.

To Top
error: Content is protected !!