కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

శ్రీలంక‌పై సెంచ‌రీ చేసిన ఛ‌తేశ్వ‌ర్ పుజారా!

భార‌త్, శ్రీలంక జ‌ట్ల మ‌ధ్య జరుగుతున్న‌ తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా సెంచ‌రీ కొట్టాడు. ఆయ‌న 173 బంతుల్లో 8 ఫోర్లు బాది శ‌త‌కం సాధించాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో పుజారా సెంచరీ మార్కు చేరుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 27 పరుగుల వద్ద ముకుంద్(12) వికెట్ ను కోల్పోవడంతో పుజారా బ్యాటింగ్ కు దిగాడు. ఓ వైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, మరోవైపు వన్ డౌన్ ఆటగాడు పుజారా ఆచితూచి ఆడాడు. 80 బంతుల్లో అర్థ శతకం చేసిన పుజారా.. ధావన్ 168 బంతుల్లో 190 ర‌న్స్ సాధించాడు. టీమిండియా ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌.. టెస్టుల్లో తొలి డ‌బుల్ సెంచ‌రీ చేసే అవ‌కాశాన్ని మిస్ చేసుకున్నాడు. శ్రీలంక‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్‌లో 190 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు ధావ‌న్. అయితే టెస్టుల్లో అత‌నికిదే అత్య‌ధిక స్కోరు. గ‌తంలో ఆస్ట్రేలియాపై చేసిన 187 స్కోరును అత‌ను అధిగ‌మించాడు. అప్ప‌ట్లో ఆ స్కోరును కూడా అత‌ను తొలి రోజే సాధించ‌డం విశేషం. ఇప్పుడు కేవ‌లం 168 బాల్స్‌లోనే 190 ర‌న్స్ చేశాడు. అందులో 31 ఫోర్లు ఉన్నాయి. మొద‌టి నుంచీ లంక్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డిన ధావ‌న్‌.. సునాయాసంగా ప‌రుగులు సాధించాడు. పుజారాతో క‌లిసి రెండో వికెట్‌కు 153 ప‌రుగులు జోడించాడు. ఆ త‌ర్వాత‌ కెప్టెన్ విరాట్ కోహ్లీ 3 పరుగుల వ‌ద్ద నిరాశపరిచినా, అనంతరం క్రీజులోకొచ్చిన అజింక్య రహానే సహకారంతో సెంచరీ చేశాడు. పరుగులు చేసేందుకు రహానే ఇబ్బంది పడుతున్నా పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 328పరుగులు చేసిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!