కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

క్రికెట‌ర్ శ్రీశాంత్ డ్రీమ్ ఏమిటంటే?

cricketer sreesanth dream role
క్రికెట‌ర్ శ్రీశాంత్ డ్రీమ్ ఏమిటంటే?

ఇండియ‌న్ క్రికెటర్‌ శ్రీశాంత్ 2019లో జ‌రిగే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడాల‌న్న‌దే త‌న క‌ల అన్నారు. ఇది నిజంగా అంత సులువైన విష‌యం కాదు, కానీ నా డ్రీమ్ అదే. అది అసాధ్య‌మే అంటున్నాడాయ‌న‌. తాను మళ్లీ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడితే అది నిజంగా అద్భుత‌మే అంటున్నారు. ఫాస్ట్ బౌల‌ర్ల కోసం తీవ్ర పోటీ ఉంది. కానీ నేను టీమిండియాలోకి ప్ర‌వేశించిన‌ప్పుడు కూడా అలాగే ఉంది. కాంపిటీష‌న్ ఉంటేనే ఉత్త‌మ ప్ర‌తిభ బ‌య‌ట‌ప‌డుతుందన్నారు శ్రీశాంత్. నేను మ‌ళ్లీ ఆడుతాన‌న్న న‌మ్మ‌కం ఉంద‌ని క్రికెట‌ర్ శ్రీశాంత్ అన్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో క్రికెట‌ర్ శ్రీశాంత్‌కు కేర‌ళ హైకోర్టు ఊర‌ట ల‌భించిన విష‌యం తెలిసిందే. శ్రీశాంత్‌పై బీసీసీఐ ఇదివ‌ర‌కు జీవిత‌కాల నిషేధాన్ని విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మార్చిలో శ్రీశాంత్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆగ‌స్టు 7న‌ తుది తీర్పునిచ్చింది. దీంతోపాటు శ్రీశాంత్‌కు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలను బీసీసీఐ వెనుకకు తీసుకోవాలని జస్టిస్ మహ్మద్ ముస్తాక్ నేతృత్వంలోని హైకోర్టు తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2013 ఐపీఎల్-6 స్పాట్‌ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణంలో అప్పటి రాజస్థాన్ రాయల్స్ ఆటగాడైన శ్రీశాంత్‌పై అభియోగాలు రుజువు కావడంతో బీసీసీఐ జీవితకాల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పోలీసులు సరైన సాక్ష్యాధారాలు సమర్పించని కారణంగా 2015లో పాటియాల కోర్టు శ్రీశాంత్‌తో పాటు అంకిత్ చవాన్, అజిత్ చండీలాపై బోర్డు విధించిన నిషేధాన్ని తొలిగించింది. అయినా, బీసీసీఐ తన క్రమశిక్షణ కమిటీ నిర్ణయానికే కట్టుబడతూ శ్రీశాంత్‌పై ఉన్న నిషేధాన్ని ఇన్నాళ్లు కొనసాగిస్తూ వచ్చింది. దీనిపై ఈ ఏడాది మార్చిలో శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలోనే శ్రీశాంత్‌పై నిషేధం ఎందుకు ఎత్తివేయరో చెప్పాలంటూ బీసీసీఐకి కేరళ హైకోర్టు నోటీసులు పంపింది. పలుమార్లు పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తాజాగా నిషేధం ఎత్తివేస్తూ తుది నిర్ణయం తీసుకుంది. నిషేధం కారణంగా శ్రీ శాంత్ నాలుగేండ్లుగా క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం సెంట్రల్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. సినిమాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న శ్రీశాంత్ నటించిన టీమ్ 5 చిత్రం గత వారమే విడుదలైంది. కేరళ హైకోర్టు తీర్పుపై ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం(కేసీఏ) హర్షం వ్యక్తం చేసింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!