కమ్మోళ్ల రాజ్యంలో కాపులకు ఎందుకు అవార్డులు’ షాకింగ్ కామెంట్స్...!!!మధ్యాహ్న భోజనంలో పెరుగు తింటే ఎన్ని లాభాలో...........మాట మీద నిల‌బ‌డ్డ కేసీఆర్‌......హెచ్‌-1 బీ వీసాలు మ‌రింత క‌ఠినం.........క్లిక్ కొట్టండి...డ‌బ్బు సంపాదించండి..ఇక మీరు కూడా ట్రాఫిక్ పోలీస్‌......త‌న చితికి తానే నిప్పు పెట్టుకుంది.....ఎలానో తెలుసా........చిరంజీవి పార్టీ ఓడిపోవడానికి కారణం ఆయన కులమే... పోసాని తాజా సంచలనంప్రశాంత్ కిషోర్ టీమ్..vs వైసీపీ లీడర్స్ పాదయాత్రలో తలపట్టుకుంటున్న జగన్..ఎల్..రమణ పార్టీ అధ్యక్షుడిగా పనికి రాడా..?? రేవంత్ లేని పార్టీ ఎలా అయిందో చూడండి..ప్రభాస్ అవార్డుకు అనర్హుడా... అల్లు అర్జున్ బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టా..???
క్రీడలు

ఈయ‌న పంచ్ కు 1500 కోట్లు?

ఈయ‌న పంచ్ కు 1500 కోట్లు?

బాక్సింగ్ అంటే యువ‌త‌కు చాలా క్రేజ్. బాక్సింగ్ లో రాణించాల‌న్న యువ‌త న‌గ‌రంలో చాలా మంది ట్రెయినింగ్ తీసుకుంటున్నారు. అయితే వీళ్ల‌కు ఆద‌ర్శంగా నిలిచాడు అమెరికా దిగ్గజం ఫ్లాయిడ్‌ మేవెదర్‌. ఈయ‌న గ‌త 50 సార్లు బాక్సింగ్ రింగ్ లోకి దిగి అజేయుడుగా నిలిచాడు. మేవెద‌ర్ ప్రొ బాక్సింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. అజేయంగా 50 మ్యాచ్‌లు గెలిచిన తొలి బాక్సర్‌గా ఘనత సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆగ‌స్టు 27న‌ జరిగిన 50వ‌ మ్యాచ్‌లో మేవెదర్‌ ఐర్లాండ్‌కు చెందిన కానర్‌ మెక్‌గ్రెగర్‌ను చిత్తు చేశాడు. ఈ విజయం ద్వారా ప్రైజ్‌మనీ రూపంలో మేవెదర్‌ దాదాపుగా రూ. 1500 కోట్లు సొంతం చేసుకోనున్నాడు! మ్యాచ్‌ ఆడినందుకు గాను కనీస మొత్తం కింద రూ. 638 కోట్లు తీసుకోనున్నాడు మేవెద‌ర్. మ్యాచ్‌ ద్వారా వచ్చిన ఆదాయంలో వాటా, స్పాన్సర్‌షిప్‌ ఆధారంగా మిగతా మొత్తం దక్కించుకోనున్నాడు. మ్యాచ్‌లో ఓటమిపాలైన మెక్‌ గ్రెగర్‌ కూడా సుమారు రూ.447 కోట్లు ఆర్జించనున్నాడు. కానీ ఈ ఆట‌లో ప్రాణాలు కూడా కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అందుక‌ని నైపుణ్యం ఉన్న గురువుల ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకుంటేనే రాణిస్తారంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

To Top
error: Content is protected !!